Post Office: పోస్టాఫీస్ లో అదిరిపోయే స్కీమ్.. వందల్లో ఇన్వెస్ట్ చేస్తే.. లక్షల్లో లాభం.. పూర్తి వివరాలివే

Post Office:  డబ్బులు సంపాదించడమే కాదు..ఎలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కూడా తెలుసుకోవాలి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనే విషయం కూడా చాలా కీలకమైంది. ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ కోసమైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంటు. ఇందులో కనీసం నెలకు 100 రూపాయల పెట్టుబడితో చేయవచ్చు. గరిష్ట పరిమితి అంటూ  ఏమీ లేదు.
 

1 /6

 Post Office:  మీరు నెలకు రూ.5000 లేదా రూ. 10వేలు ఆదా  అనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో మీకు తెలియట్లేదా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఉన్న పోస్ట్ ఆఫీస్ స్కీమ్లలో నెలకి ఎంత మొత్తం అయినా సరే ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ లక్షల్లో రిటర్న్ పొందే అవకాశం ఉంటుంది.  

2 /6

 చిన్న మొత్తాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎలాగో ప్రభుత్వం మద్దతు ఉంటుంది. కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీగా రిటర్న్స్ ను పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో చాలా పథకాలు ఉన్నాయి. అన్నికూడా  వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయి. మహిళల కోసం, ఆడపిల్లల కోసం, ఉద్యోగుల కోసం, సీనియర్ సిటిజన్ల కోసం ఇలా చాలా పథకాలు ఉన్నాయి.

3 /6

 ఇందులో ఇప్పుడు ఒక పథకం గురించి మనం తెలుసుకుందాం. చిన్న మొత్తాల పొదుపు పథకాలలో ఒకటైన పోస్టింగ్ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్. దీంట్లో ప్రస్తుతం జనవరి- మార్చి త్రైమాసికానికి గాను వడ్డీ రేటు 6.7% ఉంది. కనీసము 100 రూపాయల నుంచి ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. సింగిల్ గా లేదా జాయింట్ గా ఈ స్కీమ్స్ లో చేరేందుకు ఛాన్స్ ఉంటుంది.  

4 /6

 మైనర్ పేరుతో కూడా అకౌంట్ తీసుకోవచ్చు. 10ఏళ్ల పైబడిన  సొంతంగా అకౌంట్ తీసుకోవచ్చు. ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు.  అయితే ఇక్కడ పెట్టుబడులపై లోన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ముందు విత్ డ్రా చేసుకోవచ్చు.  ఇక మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. అకౌంట్ మెచ్యూరిటీ తర్వాత ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం పది సంవత్సరాలు పెట్టుబడి పెట్టుకోవచ్చు.  

5 /6

 ఉదాహరణకు ఇప్పుడు మనం ఇందులో నెలకి 5000 రూపాయల చొప్పున పెట్టుబడి చేస్తే 6.7% వడ్డీ రేటు ప్రకారం ఐదేళ్లకు మీకు పెట్టుబడి మూడు లక్షలు కాకుండా  వడ్డీ రూపంలో 56,830 రూపాయలు వస్తుంది. అదే మరో 5 ఏళ్ళు పొడిగించినట్లయితే అప్పుడు మీ చేతికి 8,54,272 వస్తుంది. ఇక్కడ ఆదా చేస్తే సరిపోతుంది.  

6 /6

 ఇదే నెలకు పదివేల తో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఐదేళ్ల వడ్డీతో 1.13లక్షలు అందుకోవచ్చు. అదే మరో 5 ఏళ్లు పొడిగించినట్లయితే 5 లక్షల పైగా వడ్డీ రేటు వస్తుంది. అదే 15000, 20,000 ఇలా ఎంతైనా మీ స్తోమతను బట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.