IPL 2023 Updates: ఐపీఎల్ ప్రారంభం కోసం క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. పరుగుల వరద పారే ఈ క్యాష్ లీగ్ ఫుల్ కిక్ ఇవ్వనుంది. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 టైటిల్ గెలుచుకునేందుకు 10 ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టాప్-5 ఆటగాళ్లపై ఈ సీజన్‌లో ప్రత్యేక దృష్టి నెలకొంది. ఆ ప్లేయర్లు ఓ లుక్కేయండి..
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ గత సీజన్‌లో దుమ్ములేపాడు. 17 మ్యాచ్‌లలో 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఈసారి కూడా బట్లర్‌పై రాజస్థాన్ భారీ ఆశలు పెట్టుకుంది.
టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అన్ని ఫార్మాట్స్‌లో సెంచరీల వరద పారిస్తున్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ తరపున 483 పరుగులు చేశాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉండడంతో డిఫెండింగ్ ఛాంపియన్ హ్యాపీగా ఉంది.
ఇంగ్లండ్ నయా తుఫాన్ హ్యారీ బ్రూక్ తొలిసారి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. 24 ఏళ్ల ఈ బ్యాట్స్‌మెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. మిడిల్ ఆర్డర్‌లో అతని దూకుడు ఇన్నింగ్స్‌తో క్షణాల్లో మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలడు.
హిట్‌మేయర్ కూడా ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నాడు. గత సీజన్‌లో 44.86 సగటుతో 314 పరుగులు చేశాడు. రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. డెత్ ఓవర్లలో హిట్‌మేయర్‌పై రాజస్థాన్ భారీ ఆశలు పెట్టుకుంది.
విల్ జాక్స్ స్థానంలో కివీస్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ ఆర్‌సీబీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 117 టీ20 మ్యాచ్‌లు ఆడి 2,284 పరుగులు చేశాడు. అంతేకాడు బౌలింగ్‌లో 40 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది.