Tirumala Temple: తిరుమలేషుడికి కోట్లాభిషేకం.. టీటీడీకి రూ.6 కోట్ల భూరి విరాళం

Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala Temple, భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచిన ప్రసిద్ధ తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. విరాళానికి సంబంధించిన డీడీలను ఆలయ అధికారులకు సమర్పించారు. ఆయన ఎవరో తెలుసా?

1 /6

తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. హుండీల్లో భారీగా కానుకలు లభిస్తుండగా.. అదేస్థాయిలో విరాళాలు కొనసాగుతున్నాయి.

2 /6

తిరుమల ఆలయానికి మరో భారీ విరాళం దక్కింది. రూ.6 కోట్ల నగదును చెక్కురూపంలో ఓ భక్తుడు సమర్పించాడు. ఈ వార్త తిరుమలలో చర్చనీయాంశంగా మారింది.

3 /6

తమిళనాడులోని చెన్నైకి చెందిన వైద్యుడు వర్ధమాన్ జైన్ టీటీడీ ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో వర్ధమాన్‌ చెక్కులను ఆలయ అధికారులకు ఇచ్చారు.

4 /6

రూ.6 కోట్లలో ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కోసం రూ.కోటి విలువైన డీడీలను వర్ధమాన్‌ జైన్‌ అందించారు. గతంలో కూడా వర్ధమాన్‌ జైన్‌ పలుమార్లు భారీ విరాళాలు అందించారు.

5 /6

టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీలను వర్ధమాన్‌ కుటుంబసభ్యులు అందజేశారు. అంతకుముందు తిరుమల వేంకటేశ్వర స్వామిని దాత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దాత కుటుంబాన్ని ఆలయ అధికారులు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు.

6 /6

తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శన చివరి రోజు సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడాయి.