Jaji kaya health benefits: జాజీ కాయలో మనిషి శరీరానికి మేలు చేసే పుష్కలమైన గుణాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు కూడా జాజీకాయ పౌడర్ ను వేడి నీళ్లలో వేసుకుని తాగాలంటారు.
పలావ్ దినుసుల్లో జాజికాయ ఎంతో ముఖ్యమైందని చెబుతుంటారు. దీన్ని ఆయుర్వేదంలో కూడా పుష్కలంగా ఉపయోగిస్తారు. జాజీకాయ చేసే మేలు వల్ల శరీరంలోని అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
జాజీకాయను పొడిగా చేసుకుని ప్రతిరోజు గోరు వెచ్చని నీళ్లలో వేసుకుని తింటే.. మల బద్దకం, గొంతులో గర గర వంటి సమస్యలు మటుమాయమైపోతాయంట. చలికాలంలో రోజు ఉదయం చిన్న జాజీకయను నోట్లో వేసుకుని కాసేపు ఆ నీళ్లను మింగాలంట. దీనిలో.. విటమిన్ లు, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, శరీరంకు మేలు చేసే అనేక గుణాలు దీనిలో ఉంటాయంట.
అందుకు చలికాలంలో జాజీ కాయల్ని చూర్ణం చేసుకుని పెట్టుకొవాలంట. ఇది నొట్లో వేసుకుంటే నొటి దుర్వాసన దూరమౌతుంది. జాజీ కాయ పౌడర్ ను తేనె కలుపుకుని నీళ్లలో వేసుకుని తాగుతుంటే.. బెల్లీ ఫాట్ క్రమంగా తగ్గిపోతుంది. అంతే కాకుండా.. ముఖంపై మచ్చలున్నవారు, మొటిమలు ఉన్న వారు జాజీకాయ వల్ల మంచి మార్పులు పొందుతారంట.
అంతే కాకుండా..దీనిలో చర్మసమస్యలు దూరంచేసే గుణాలు కూడా ఉంటాయంట. ముఖంను కాంతి వంతంగా కూడా చేస్తుందంట. జాజీ కాయ పొడిని తేనె మిక్స్ చేసి..దాన్ని ముఖంకు అప్లై చేయాలి.
జాజీ కాయను నోట్లోపెట్టుకుని చప్పరించడం వల్ల కూడా.. అనేక ఉపయోగాలు కల్గుతాయంట. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయంట. కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా దీని వల్ల దూరమౌతాయంట. శరీరంలోని జీర్ణం కానీ పదార్థాలను ఇది జీర్ణమయ్యేలా చేస్తుందంట.