Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో ఈమె గోల్డ్ కలర్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేసింది జాన్వీ కపూర్.
తాజాగా జాన్వీ కపూర్ అనంత్ అంబానీ పెళ్లిలో గోల్డ్ కలర్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేశారు. ఆమె వేసుకున్న డ్రెస్ పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే ఆమెకు వరుస ఛాన్సెస్ వస్తున్నాయి. నార్త్ లో సరైన బ్రేక్ రాకపోవడంతో సౌత్ సినిమాలు అంటే ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.
మొత్తంగా తెలుగులో తారక్ తో చేస్తోన్న దేవర రెండు భాగాతో పాటు రామ్ చరణ్ తో RC 16 సినిమాలతో ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటడం పక్కా అని జాన్వీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
జాన్వీ కపూర్.. మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్, హను రాఘవపూడి ‘ఫౌజీ’ చిత్రంలో జాన్వీనే కథానాయికగా తీసుకున్నట్టు సమాచారం. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.