Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు తెలుగులో మరో బంపరాఫర్.. టాలీవుడ్‌లో మరో బడా స్టార్ హీరో సరసన శ్రీదేవి తనయ..

Jahnvi Kapoor:  శ్రీ‌దేవి కూతురుగా సినీ  ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన  జాన్వీ కపూర్ ఇప్పటికీ స్టార్ కిడ్‌గానే ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. అందుకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.  ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర'తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ భామ.. ఈ మూవీ విడుదల కాకముందే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈమెకు మరో తెలుగు స్టార్ హీరో సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.

1 /6

ఒకప్పటి అతిలోకసుందరి శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్పీడ్‌లో  ఉంది.

2 /6

బాలీవుడ్‌లో 'ధడక్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో నటించింది. ఈ సినిమా థియేట్రికల్‌గా  కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

3 /6

తల్లి ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బీ టౌన్ సూపర్ స్టార్ అయినా.. జాన్వీ ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. 

4 /6

ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది. ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.

5 /6

అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌, బుచ్చిబాబు సన మూవీలో యాక్ట్ చేస్తోంది. వరుసగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో జోడి కట్టడంతో ఇక్కడ ఇండస్ట్రీపై ఫుల్ నజర్ పెట్టిందనే చెప్పాలి.

6 /6

తాజాగా ఈమె ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాలో కథానాయిగా ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. వరుసగా ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇపుడు.. ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ కెరీర్‌ను బాగానే ప్లాన్ చేసుకుంటుంది.