Devara NTR Record: ‘దేవర’ మూవీతో ఎన్టీఆర్ ఖాతాలో మరో రేర్ రికార్డ్..

Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం  ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ రామ్ నందమూరి, మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.

1 /6

Devara 100 Days: ఓటీటీలు వచ్చిన తర్వాత ఒక సినిమా ఓ వారం రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందనే దానిపై ఆ సినిమా హిట్టా..? ఫట్టా అని డిసైడ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే బడా హీరోలు తమ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యేలా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ యుగంలో  ఓ సినిమా రెండు వారాలు ఆడితే గొప్ప అనుకునే రోజుల్లో ఎన్టీఆర్ ‘దేవర’తో కొత్త రికార్డు క్రియేట్ చేశారు.

2 /6

గతేడాది సెప్టెంబర్ 27న విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ.. ఈ నెల 4తో ఈ సినిమా 100 రోజుల పరుగును పూర్తి చేసుకుంది. అది కూడా 6 కేంద్రాల్లో ‘దేవర’ మూవీ 100 రోజుల రన్ పూర్తి చేసుకోవడం విశేషం.

3 /6

మొత్తంగా ఈ సినిమా తూర్పు గోదావరిలో మల్లికి పురమ్ లో పద్మజా కాంప్లెక్స్ .. మండపేటలో రాజరత్న కాంప్లెక్స్ తోపాటు గుంటూరు జిల్లాలో రామకృష్ణ.. చిత్తూరులో ద్వారకా పిక్చర్స్ ప్యాలెస్, కొల్లూరులోని ఎంఎన్ఆర్, రొంపిచెర్లలో ఎంఎం డీలక్స్ థియేటర్ లో ఈ సినిమా 100 రోజులు పరుగును పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

4 /6

ప్రస్తుతం ‘దేవర’ మూవీ నెట్ ఫ్లిక్స్ లో హిందీ సహా భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు విదేశీ భాషలైన స్పానిష్, కొరియన్, బ్రెజిలియన్, ఇంగ్లీష్ లో  ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

5 /6

త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ జపాన్ లో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సక్సెస్  తర్వాత  ‘దేవర’తో అదే రేంజ్ సక్సెస్ అందుకోక పోయినా.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో కుమ్మేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. రూ. 500 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరింది.  తెలుగు రాష్ట్రాల్లో రూ. 180 కోట్ల షేర్.. (రూ. 350 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే కదా.

6 /6

ప్రస్తుతం ఎన్టీఆర్.. వరుస సినిమాలు చేస్తున్నారు. హిందీలో హృతిక్ రోషన్ తో ‘వార్ 2’, దేవర పార్ట్ -2, ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ మూవీతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్, వెట్రిమారన్ చిత్రాలున్నాయి.