Karthika Deepam 2: బతుకు బండి బుగ్గి.. గుండెలవిసేలా ఏడ్చిన వంటలక్క, నిజం తెలిసినా నోరు విప్పని కార్తీక్‌..

Karthika Deepam 2 Today January 13th Episode: నేటి ఎపిసోడ్‌లో అర్ధరాత్రి దీప చితకబాదిన రౌడీ టిఫిన్‌ బండీ తగులబెట్టడానికి వస్తాడు. జ్యోత్స్న ఆ పనిచేయిస్తుంది. బండీ కాలడం చూడండి అంటూ ఆ రౌడీ జ్యోత్స్నకు వీడియో కాల్‌ చేస్తాడు. నీ బతుకు బండీ కాలడం నేను చూడాలి దీప అంటుంది జో. నా పరువు ఆఫీసులో, ఇంట్లో రెండుచోట్ల నీవల్ల పోయింది అంటుంది. ఇక బండీ తగులబెట్టేస్తారు. 
 

1 /9

అప్పుడే దీపకు మెలుకువ వస్తుంది. ఎంత ఆనందంగా ఉంది అంటుంది జో. ఈ బండీ చూసుకుని కదా ఏదో సాధించావు అని మా మమ్మి కూడా తెగపొగుడుతోంది. ఎవర్ని ఎప్పుడు? ఎక్కడ? కొట్టాలి నాకు తెలుసు దీప అంటుంది. అప్పుడే దీప లైట్స్‌ ఆన్‌ చేయడం ఆ రౌడీలు చూస్తారు. బండీ తగులబడిపోవడం దీప చూస్తుంది. ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. అయ్యో.. అయ్యో అంటూ బయటకు పరుగు తీస్తుంది. కార్తీక్‌ బాబు.. కార్తీక్‌ బాబు అంటూ ఏడుస్తుంది. అయ్యో నా బండీ కాలిపోతుంది అని ఏడుస్తుంది. కార్తీక్ వచ్చి చూసి షాకవుతాడు. రేయ్‌ .. ఆగండ్రా అంటూ అరుస్తాడు.  

2 /9

మొత్తం తగులబెట్టేశారు కదరా.. అని రౌడీల వెంబడి పరుగెత్తుతాడు కార్తీక్‌. అప్పుడే అనసూయ, కాంచన కూడా బయటకు వస్తారు. చూసి వాళ్లు కూడా కంటతడి పెట్టుకుంటారు. కార్తీక్‌ వాళ్లను పట్టుకుంటాడు. నువ్వా? అంటాడు కార్తీక్‌. అవును రా ఆరోజు నన్ను కొట్టారు కదా ఎలా ఉంది నా దెబ్బ అంటాడు. దీంతో వారిని చితకబాదుతాడు కార్తీక్‌. అప్పుడే జో ఆ రౌడీకి కాల్‌ చేస్తుంది. కారత్ఈక్‌ ఆ ఫోన్‌ చూస్తాడు. ఇది జ్యోత్స్న ఫోన్‌ నంబర్‌ కదా అని ఫోన్‌ ఎత్తుతాడు. రేయ్‌.. ఏమైంది రా అంటుంది. వెంటనే వాడు ఫోన్‌ లాక్కొని పారిపోతాడు. జ్యోత్స్న.. అని కేకలు వేస్తాడు కార్తీక్‌. ఇంటి ఓనర్‌ చుట్టుపక్కల వారు కూడా పరుగెత్తుకుని తగలబడుతున్న బండీ వద్దకు వస్తారు. అయ్యో అంటారు. అప్పుడే కార్తీక్‌ కూడా తిరిగి ఇంటికి వస్తాడు.  

3 /9

చూడండి కార్తీక్‌ బాబు మన బండి తగులబడిపోతుంది అని ఏడుస్తుంది దీప. ఇది బండీ కాదు మనకు తిండి పెట్టే అమ్మ అని దీప ఏడుస్తుంది. దీనిమీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం అన్ని కాలిపోయాయి బాబు అంటుంది. వాళ్లని తరుముకుంటూ వెళ్లారు కదా ఏమైంది? అంటుంది దీప. వాళ్లు ఎవరు తెలిసింది అంటాడు. ఎవర్రా? ఎవడు అంటారు కాంచన, అనసూయలు. ఆరోజు టిఫిన్‌ చేసి డబ్బులు ఇవ్వనంటే దీప కొట్టింది కదా వాడే ఈ పని చేసింది అంటాడు. పదండి కార్తీక్‌ బాబు, వాడు ఎక్కడ ఉన్న తీసుకువచ్చి ఈ మంటల్లో తోసేద్దాం అంటుంది. వాడిని మనం ఇప్పుడు ఏమీ చేయలేము. ఊరు పేరు లేని వాడు ఎక్కడ వెతుకుదాం అంటాడు.   

4 /9

నా వల్ల కావడం లేదు కార్తీక్‌ బాబు. మంచుకు తడిస్తే పాడవుతుందని బట్ట కప్పేదాన్ని అలాంటిది మన కళ్ల ముందే మనకు అన్నం పెట్టిన అమ్మ కాలిపోతుంది బాబు అని ఏడుస్తుంది. జో ఈ పని చేయించిందని కార్తీక్‌ ఇంట్లో వారికి చెప్పడు. తెల్లవారుతుంది దాసు పరామర్శించడానికి వస్తాడు. నువ్వు ఏడిస్తే బండి తిరిగి వస్తుందా? అమ్మ అంటాడు కార్తీక్‌. ఇదంతా ఆ రౌడీగాడే చేశాడు. టిఫిన్‌ బండి వద్ద గొడవ చేశాడు అని కొట్టింది అంటుంది కాంచన  

5 /9

పద బావ కంప్లైంట్‌ ఇద్దాం పోలీసులకు అంటాడు కాశీ. వాడే అని ఆధారాలు లేవు అంటాడు కార్తీక్‌ మరి ఇంకెవరు శత్రువులు ఉన్నారు బావ అంటాడు. అప్పుడే జో వస్తుంది. బావ రాత్రి టిఫిన్‌ బండి వద్ద ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగి మొత్తం కాలిపోయింది అంట కదా అంటుంది. కాలిపోలేదు, కాల్చారు. అర్ధరాత్రి దొంగతనంగా నా ఇంటికి వచ్చి ఎదురుగా పోరాడలేక ఇలా చేశారు.   

6 /9

అలాంటి వారిని ఊరికే వదల కూడదు బావ. పాపం మీరు ఎంతో కష్టపడి ఉన్నదంతా ఊడ్చి బతకడానికి టిఫిన్‌ బండి పెట్టుకున్నారు. దీప ఏది రాత్రి జరిగిందానికి లోపల కూర్చొని ఏడుస్తుందా? అంటుంది. ఏడుస్తూ కూర్చోవడానికి కాలిపోయింది మేము పెట్టిన బండీ. మాకు వచ్చిన పని కాదు. బండి మీద కాకపోతే, బల్లమీద పెట్టుకుని అమ్ముతాం అంటుంది.  

7 /9

దీప టిఫిన్స్‌ ఉన్నాయా? అని గిరాకీ వస్తుంది. ఎప్పిటిలాగే టిఫిన్‌ అమ్ముతారు దీప కార్తీక్‌లు. అప్పుడే చుట్టుపక్కవారు క్లాప్స్‌ కొడతారు. బండి కాలిపోతే బాధపడతారు అనుకున్నాను అంటాడు ఓనర్‌. అద్దె ఏం కడతారు వెళ్లిపోతారులే అనుకున్నా. నీ మాటలే భయాన్ని పోగొడతాయి. నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురువి.. బాబు ఇదిగో నీ ఫోన్‌ అని కార్తీక్‌ ఫోన్‌ కూడా తిరిగి ఇచ్చేస్తాడు. మీరంటే ఏంటో ఈమధ్యే తెలిసింది. ఇది మీకు అవసరం. నా మొఖం చెల్లక రాలేదు. ఇప్పుడు రావాల్సి వచ్చింది. మీకు చేతులెత్తి మొక్కాలి అంటాడు కార్తీక్‌. వద్దు బాబు మీలాంటి వారికి కష్టం వస్తే అండగా ఉండాలి బాబు అని టిఫిన్‌ కొని తీసుకుంటాడు. మళ్లీ దీప టిఫిన్‌ బండికి గిరాకీ ఎప్పటి లాగే వస్తుంది.  

8 /9

మనవాళ్లు తప్ప అందరూ బాగానే ఉన్నారు అంటుంది స్వప్న. ఎంటే నన్నే అంటున్నావా? అంటుంది జో. హౌస్‌ ఓనర్‌ వచ్చి నాలుగు మాటలు చెప్పగానే గొప్పవాడు అయిపోయాడా? అంటుంది. నేను కూడా నాలుగు మాటలు చెప్పడానికే వచ్చా అంటుంది. స్వప్నను సవతి కూతురు అని నోరు పారేసుకుంటుంది. కాశీని కూడా తిడుతుంది జో.  

9 /9

కాశీ నీకు తమ్ముడు అంటాడు అసలు నువ్వు ఎందుకు వచ్చావే ఇక్కడకు అంటుంది కాంచన. నీకొడుకు నా నోరు తెరవనీయడు అంటుంది. మీకు సాయం చేయడానికి వచ్చా అంటుంది. నేనేం సాయం చేశా అంటుంది. నువ్వే సాయం చేయాల్సిన అవసరంలేదు. బండి లేకపోతే బండి, లేదు సైకిల్‌ అది కూడా లేకపోతే నాలుగు క్యాన్లు పెట్టుకుని ఫుట్‌పాత్‌పై కూర్చుంటాడు అంటాడు కార్తీక్.