Bhogi 2025: వైభవంగా భోగి సంబురాలు.. మంచుఫ్యామిలీ, రోజా కుటుంబం ఫోటోలు వైరల్‌..

Bhogi 2025 Celebrations Photos: భోగి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు కూడా భోగి మంటలు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక మంచు ఫ్యామిలీ కూడా భోగి సంబరాలు జరుపుకున్నారు.  ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
 

1 /7

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ భోగి మంటలు వేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు పాల్గొన్నారు.  ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు పండుగులు, ఆచారాలను కొనసాగించాలని అన్నారు  

2 /7

ఇక మాజీ మంత్రి ఆర్‌కే రోజా కూడా కుటుంబ సభ్యులతో భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆమె స్వగృహంలో ఉదయమే భోగి మంటలు వేసి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  

3 /7

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఆయన రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు  

4 /7

ఇక మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కూడా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. పార్టీ అభిమానులతో ఆయన ఘనంగా వేడుకలు జరిపారు లంబాడీలను నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  

5 /7

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ భోగభాగ్యాలు కలగాలని ఆయన మీడియాతో చెప్పారు.  

6 /7

తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. భోగి పండుగ విశిష్టత తెలుపుతూ వేడుకలు జరుపుకున్నారు. మహబూబ్‌ నగర్‌లో ఘనంగా భోగి మంటలు నిర్వహించారు   

7 /7

రాజమండ్రిలో కూడా భోగి వేడుకలు ఘనంగా జరిగాయి తెల్లవారుజామున సంక్రాంతి సంప్రదాయాల్లో భాగంగా భోగి మంటలు వేశారు. ఎంపీ భరత్ కూడా కళాకారులతో పాటు భోగి మంటలు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.