Weather Update Heavy Rains: ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటికే పొగ మంచు పేరుకు పోయింది చలి తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది .వాతావరణ శాఖ ముఖ్యంగా కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
మూడు రోజులు వర్షాలు సంక్రాంతి సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు పడతాయని సూచించింది.
ఇక యానంలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. అర్ధరాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో వర్షం కూడా కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా విపరీతంగా పెరుగుతుంది. సింగల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆయా ప్రాంతాలు వణికిపోతున్నాయి.
ఇక ఆదిలాబాద్ కొమరంభీం జిల్లాలో కూడా సింగల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే తగ్గుతూ నమోదు అవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత కూడా పొగ మంచు పేరుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే వాహనదారులకు వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది. ఉదయం ప్రయాణాలు చేసే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్లాలి.. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో బయటకు వెళ్లకపోవడమే మేలు అయితే పండగ సందర్భంగా ప్రయాణాలు చేస్తున్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక ఈ సమయంలో బయటకు వెళ్ళేటప్పుడు స్వెటర్లు, మఫ్లర్లు వంటివి ధరించాలి.. ముఖ్యంగా చలికోట్లు ధరించి బయటకు వెళ్లాలి. లేకపోతే అనారోగ్యం బారిన పడతారు. వృద్ధులు, పిల్లలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఈ సీజన్లో ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోండి.