Kavya Maran Dating Rumors: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు ఉన్న సమయంలో స్టేడియంలో కావ్య చేసే అల్లరి అంత ఇంత కాదు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె దీనంగా ఉండే ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వైరల్ అవుతుంటాయి. జట్టు విజయం సాధిస్తే ఆనందానికి అవధులు ఉండవు. చిన్న పిల్లలా మారిపోయి గెంతులు వేస్తుంటుంది. ఇదిలా ఉంటే కావ్య మారన్ డేటింగ్ రూమర్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ యంగ్ ప్లేయర్లో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
కావ్య మారన్‌ను అభిమానులు ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్కు, స్మైల్‌కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది.
ఐపీఎల్ మొదలైదంటే కావ్య మారన్ కచ్చితంగా హైలెట్ కావాల్సిందే. ఆమె స్టేడియంలో టీమ్ యజమాని మాదిరి కాకుండా.. ఓ ఫ్యాన్‌గా జట్టును ఉత్సాహపరుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
ఇక కావ్య మారన్‌పై చాలా రోజులుగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఆమె ఓ యాక్టర్‌తో డేటింగ్లో ఉందని.. ఆ బిజినెస్‌మెన్‌తో ప్రేమలో ఉందని పుకార్లు వచ్చాయి.
ఇవన్ని పక్కనబెడితే.. టీమిండియా యంగ్ క్రికెటర్, ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో ప్రేమలో పడినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ రూమర్లు కూడా గతంలో వచ్చినా.. ఐపీఎల్ మెగా వేలానికి సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి తెరపైకి వస్తున్నాయి.
ఇతర టీమ్ ప్లేయర్లు మంచిగా ఆడినప్పుడు కావ్య మారన్ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ సమయంలో ఆమె ఎక్స్ప్రెషన్స్ భిన్నంగా ఉంటాయని నెటిజన్లు చెబుతున్నారు.
దీంతో అభిషేక్ శర్మ, కావ్య మారన్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ వార్తలు పూర్తిగా ఫేక్ అని క్రికెట్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. అభిషేక్ శర్మ (23) కంటే కావ్య మారన్ వయసు పదేళ్లు ఎక్కువ.