Kavya Maran: ఆ ప్లేయర్‌ను వదులుకున్నందుకు కావ్య పాప పశ్చాత్తాపం.. వేలంలో భారీ డిమాండ్

IPL 2025 Sunrisers Hyderabad Retention List: అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఆటగాళ్ల రిటెన్షన్ పూర్తి అయింది. ఇక త్వరలో జరిగే మెగా వేలానికి అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకుని.. మిగిలిన ప్లేయర్లను టీమ్ నుంచి రిలీజ్ చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ కీలక ప్లేయర్లు భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్ తదితర కీలక ప్లేయర్లు వేలంలోకి రానున్నారు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను జట్టును నుంచి రిలీజ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 

1 /6

వాషింగ్టన్ సుందర్ ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపాడు. బ్యాట్‌తో, బంతితోనూ రాణించాడు. దీంతో కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజ్‌మెంట్‌ను ఒప్పించి.. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు తీసుకున్నాడు.  

2 /6

కోచ్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు. రెండో టెస్టులో 11 వికెట్లు తీశాడు. మూడో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. అంతకుముందు రంజీ ట్రోఫీలో ఢిల్లీపై 152 పరుగులు చేయడంతోపాటు 6 వికెట్లు పడగొట్టాడు.  

3 /6

వాషింగ్టన్ సుందర్ ఫామ్‌ను చూసి సన్‌రైజర్స్ మళ్లీ రిటైన్ చేసుకుంటుందని అందరూ భావించారు. హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డిలను రిటైన్ చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్ మిగిలిన ప్లేయర్లను టీమ్ నుంచి రిలీజ్ చేసింది.   

4 /6

ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్‌ ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ సుందర్‌ వేలంలో భారీ ధర దక్కించుకునే అవకాశం ఉంది.  

5 /6

ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు వాషింగ్టన్ సుందర్‌ను దక్కించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

6 /6

వాషింగ్టన్ సుందర్‌కు వేలంలో భారీ దక్కినా.. సన్‌రైజర్స్ ఆర్‌టీఎమ్ కార్డును ఉపయోగించే అవకాశం ఉంది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో అదరగొడుతున్న ఈ యంగ్ ఆల్‌రౌండర్‌కు వేలంలో భారీ డిమాండ్ ఉండడం గ్యారంటీ.