Keerthy Suresh: స్టార్ తెలుగు హీరో కొడుకుకి కీర్తి సురేష్ అత్త అవుతుందంట.. ఇంతకీ ఎవరంటే..!

Keerthy Suresh: మలయాళం స్టార్ హీరోయిన్ మేనక వారసురాలిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. చిరంజీవి - సిమ్రాన్ జంటగా నటించిన డాడీ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలలో నటించింది. కానీ క్యారెక్టర్ కు సూట్ కాలేదని అక్కడి నుంచి ఆమెను తప్పించారు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా మరే సినిమా చేయలేదని సమాచారం. ఆ తర్వాత హీరోయిన్ గా మారి రామ్ సరసన నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో మంచి పేరు కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఒక స్టార్ హీరో కొడుకుకి అత్త అవుతుందట.  అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 

1 /3

2 /3

పోయినసారి నా బర్త్ డే కి నాని కొడుకు నాకు ఒక వాయిస్ పంపించాడు. అది నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. నన్ను అతడు అత్త అని పిలుస్తాడు. అంతేకాదు మిస్ యు, సీ యు అనే పదాలు కూడా చాలా క్యూట్ గా పలుకుతాడు అంటూ ఆ అబ్బాయి పంపించిన వాయిస్ క్లిప్ ను ప్లే చేసింది కీర్తి సురేష్. కీర్తి అత్త హ్యాపీ బర్త్డే .. మూసీ.. సూయీ.. అంటూ నాని కొడుకు చాలా క్యూట్ గా చెప్పిన వాయిస్ రికార్డును ఆమె సేవ్ చేసి పెట్టుకున్నదట. 

3 /3

తాను వర్క్ టెన్షన్ లో ఉన్నప్పుడు ఈ వాయిస్ కచ్చితంగా వింటానని, అప్పుడే తనకు రిలీఫ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది.  సో అదన్నమాట నాచురల్ స్టార్ హీరో నాని కొడుకికి కీర్తి సురేష్ అత్త అవుతుందని సమాచారం.