Budget 2025: తులం బంగారం రూ. 82వేలు.. బడ్జెట్ తర్వాత ఏం జరుగుతుంది? భారీగా పెరగడం ఖాయమేనా?

Budget 2025: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని పసిడి ప్రియులకు షాకిచ్చాయి. హైదరాబాద్ లో తులం స్వచ్చమైన బంగారం ధర రూ. 82వేలు దాటింది. ఇక ట్యాక్స్, ఛార్జీలు కలిపితే మరింత పెరుగుతుంది. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతారన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ తర్వాత బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి. బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు. తెలుసుకుందాం. 

1 /7

Budget 2025: బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు బుధవారం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతోంది. MCX ఎక్స్ఛేంజ్‌లో ప్రారంభ ట్రేడ్‌లో, ఫిబ్రవరి 5, 2025న డెలివరీ కోసం బంగారం 10 గ్రాములకు రూ. 79,535 వద్ద 0.39 శాతం పెరుగుదలతో రూ. 311 పెరిగింది. ఇది కాకుండా, ఏప్రిల్ 4, 2025న డెలివరీ చేయడానికి బంగారం 10 గ్రాములకు 0.34 శాతం లేదా రూ. 276 పెరుగుదలతో రూ. 80,360 వద్ద ట్రేడవుతోంది. 

2 /7

బుధవారం ఉదయం బంగారంతో పాటు అంతర్జాతీయంగా వెండి ధరలు కూడా పెరిగాయి. కమోడిటీ మార్కెట్‌లో అంటే కామెక్స్‌లో వెండి ఔన్స్‌కి 0.52 శాతం లేదా 0.16 డాలర్లు పెరిగి $ 31.66 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, సిల్వర్ స్పాట్ ఔన్స్ $ 30.90 వద్ద 0.39 శాతం లేదా $ 0.12 లాభంతో ట్రేడవుతోంది.

3 /7

ఈ క్రమంలో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా లేదా బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 తర్వాత బంగారం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. 

4 /7

బంగారం ధరలు కట్టడి చేసేందుకు ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని పసిడి ప్రియులు కోరుతున్నారు. గత ఏడాది జులై 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15శాతం నుంచి 6శాతానికి తగ్గించింది.

5 /7

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చింది. ఈ క్రమంలో మరోసారి సుంకాలు తగ్గించి బంగారం ధరల పెరుగుదలను కట్టడి చేయాలని సగటు బంగారం ప్రియులు ఆశిస్తున్నారు.   

6 /7

జులై 2024లో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో ఆ తర్వాత నెల ఆగస్టు 2024లో బంగారం దిగుమతులు 104శాతం మేర పెరిగాయి. అదే సమయంలో భారత్ నుంచి నగలు, రత్నాలు ఎగుమతులు 23శాతం పడిపోయాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం వాడకం భారీగా పెరిగింది. అది  దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది.

7 /7

అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1, 2025న ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే దేశీయంగా బంగారం ధరలు రెక్కలు వస్తాయి. ఫిబ్రవరి 1 తర్వాత బంగారం ధర సామాన్యులకు అందనంతగా పరుగులు పెట్టే ఛాన్స్ ఉంటుంది.