School Holidays Due To Cold Waves: విద్యార్థులకు సెలవులు వచ్చాయంటనే ఎగిరి గంతేస్తారు. మొన్నటి వరకు సంక్రాంతి సెలవులు. ఇక ఉత్తరాదిలో స్థానిక పండుగల నేపథ్యంలో సెలవులు బాగానే వచ్చాయి. పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి కారణంగా 25వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్కూల్ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త అయింది.
రోజురోజుకు తెలుగు రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోతుంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగా నమోదవుతున్నాయి. అయితే కొన్ని స్కూళ్లలో చలి కారణంగా 25వ తేదీ వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా ఐదో క్లాసు వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ సెలవులు వర్తిస్తాయి.
అయోధ్య చంద్ర జిల్లాలో స్కూళ్లకు 25వ తేదీ వరకు సెలవులు వచ్చాయి. అయితే 6వ క్లాస్ నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు సమయం ఉంటుంది. ఇవి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయి.
ఇక మీర్జాపూర్‌లో స్కూలు నేటి నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. కానీ స్కూలు సమయాలు మాత్రం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పనిచేస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ఇచ్చిన కీలక ఆదేశాల మేరకు జనవరి 22, 23 రెండు రోజులు కూడా విపరీతమైన పొగ మంచు ఉంటుంది.
ఉదయం స్కూళ్లకు వెళ్లే సమయంలో కూడా పొగ మంచు పేరుకుంటుంది. కాబట్టి స్కూళ్ల పని సమయంలో మార్పు చేశారు. ఇక ప్రైమరీ స్కూల్ చదివే విద్యార్థులకు కొన్ని రోజులు సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో కూడా విపరీతంగా పొగ మంచు పేరుకుంది. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు అయ్యాయి.
ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతున్నాయి. ఇక ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రెండు రోజులపాటు మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.. అంతేకాదు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత మరింత పెరుగుతోంది.