Khushi -Janhvi: అక్క జాన్వీ రూట్లోనే వెళుతున్న ఖుషీ.. దక్షిణాది సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతుందా..!

Khushi Kapoor: ఖుషీ కపూర్..జాన్వీ బాటలోనే శ్రీదేవి కూతురుగా ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. సినిమాల్లో రాకముందే ఖుషీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు అక్క జాన్వీ కపూర్ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

1 /6

ఖుషీ కపూర్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో లెగ్ పెట్టక ముందే  తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ఈమె కూడా నందమూరి హీరో సినిమాతోనే సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

2 /6

ఖుషీ కపూర్.. శ్రీదేవి, బోనీ కపూర్‌ల రెండో కూతురు. ఈమె 5 నవంబర్ 2000లో జన్మించింది. త్వరలోనే  ఖుషీ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. 

3 /6

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అటు రామ్ చరణ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇపుడు అదే రూట్లో  ఖుషీ కూడా తెలుగు సినిమా నుంచే సినీ రంగ ప్రవేశం చేయడం ఖాయమనే ముచ్చట వినబడుతోంది.

4 /6

ఖుషీ  హిందీ సినిమాతో కాకుండా.. డైరెక్ట్ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఖుషీ తల్లి శ్రీదేవి, అక్క జాన్వీ బాటలో ప్రేక్షకులను అలరించడానికి ఇప్పటికే యాక్టింగ్, డాన్సింగ్, స్టంట్స్ విషయాల్లో పూర్తిగా ట్రైయిన్ అయింది.  

5 /6

ఖుషీ కపూర్.. ఒక్క సినిమా చేయకపోయినా.. ఈమెకు సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఖుషీ హీరోయిన్‌గా ఎపుడు ఎంట్రీ ఇస్తుందా కళ్లలో ఒత్తలు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.  మరి అంతా అనుకున్నట్టే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినిమాతో ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

6 /6

శ్రీదేవి గ్లామర్ షో చేసినా.. ఎక్కడా ద్దులు దాటలేదు. కానీ అతిలోకసుందరి కూతుళ్లు  అందాల ఆరబోతలో ఆ హద్దులను క్రాస్ చేసేస్తున్నారు.  గ్లామర్ షోలో ఖుషీ కపూర్.. అక్క జాన్వీ కపూర్‌కు గట్టి పోటీ ఇస్తోంది.