Government Scheme: ప్రభుత్వం నుంచి సామాన్యులకు వివిధ రకాల పథకాలు అందుతుంటాయి. ఇందులో కొన్ని పథకాలు విద్యార్ధులకు..ఇంకొన్ని వృద్ధులకు ఉంటాయి. ఇవి కాకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు కూడా ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఓ పధకంలో బిడ్డ పుడితే నగదు ఇస్తారు..
ప్రధానమంత్రి మాతృ వందన పథకం కోసం ఆశా వర్కర్లు, లేదా ఏఎన్ఎంల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ఆన్‌లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పధకాన్ని అందరు మహిళలకు వర్తింపజేస్తారు. ప్రసవం ఏ ఆసుపత్రిలో జరిగినా ఫరవాలేదు.
తొలిసారి తల్లి అయ్యే మహిళకు పోషణ అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. తొలి వాయిదాలో వేయి రూపాయలు రెండవ వాయిదాలో 2 వేలు, మూడవ వాయిదాలో 2 వేలు అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలకు ఈ పధకం వర్తించదు.
ఈ పధకం లబ్ది పొందేందుకు తొలిసారి గర్భిణీ అయినప్పుడు తనతోపాటు, తన భర్త ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ రిజిస్ట్రేషన్‌కు అవసరమౌతాయి. బ్యాంక్ ఖాతా ఉమ్మడి కాకూడదు. గర్భిణీ మహిళకు ఈ పధకం కింద 5 వేల రూపాయల నగదు మూడు వాయిదాల్లో అందుతుంది.
ప్రధానమంత్రి మాతృ వందన పథకంలో తొలిసారి గర్ణం దాల్చే మహిళలకు ఆర్ధిక సహాయం అందిస్తారు. ఈ పధకమే ప్రధానమంత్రి గర్భావస్థ సహాయ పధకం అని కూడా పిలుస్తారు.
మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం పేరు ప్రధానమంత్రి మాతృ వందన పథకం. ఈ పధకం 2017 జనవరిలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందుతుంది.