Lalit Modi: 61 ఏళ్ల వయసులో హీరోయిన్‌తో బ్రేకప్‌.. ఫారెనర్‌తో 'ఐపీఎల్‌ ఫౌండర్‌' మూడో పెళ్లి?

Lalit Modi Breakup With Heroine Sushmita Sen At 61 Years: ప్రేమికుల దినోత్సవం రోజే ఒక భారీ విడాకుల ప్రకటన వచ్చింది. రెండు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని తెంచుసుకున్న 61 ఏళ్ల పెద్దాయన వాలంటైన్స్‌ డే రోజు మూడోసారి కొత్త జీవితాన్ని ఆరంభించాడు. అతడి కొత్త జీవితంతో ఓ స్టార్ హీరోయిన్‌కు భారీ అన్యాయం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1 /7

ప్రేమికుల దినోత్సవం రోజు సినీ పరిశ్రమలో.. క్రికెట్‌ ప్రపంచంతోపాటు వ్యాపార రంగంలో భారీ పరిణామం చోటుచేసుకుంది. ప్రేమికులుగా ఉన్న లలిత్‌ మోదీ, సుష్మితా సేన్‌లు అధికారికంగా విడిపోయారు.

2 /7

ఆర్థిక నేరగాడిగా భారతదేశాన్ని వదిలివెళ్లిన దిగ్గజ పారిశ్రామికవేత్త, ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ విదేశాల్లో తలదాక్కున్నాడు. అక్కడ విలాసాలు పొందుతూ.. హాయిగా జీవిస్తున్నారు. తాజాగా ఆయన ప్రేమికుల దినోత్సవం రోజు కీలక ప్రకటన చేశారు.

3 /7

అదృష్టం అందరికీ ఒకసారిగా తగిలితే తనకు రెండుసార్లు తగిలిందని లలిత్‌ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. తాను కొత్త జీవితం మొదలుపెడుతున్నట్లు ఫిబ్రవరి 14వ తేదీన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన కొత్త ప్రేయసితో దిగిన ఫొటోలను పంచుకున్నాడు.

4 /7

'అదృష్టం ఒక్కసారే పడుతుందని అంటారు. నిజమే కానీ నేను మాత్రం రెండుసార్లు అదృష్టవంతుడిని అయ్యాను. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారడమే కారణం. మీరు కూడా ఆ భావన పొందాలని ఆకాంక్షిస్తున్నా. మీ అందరికీ వాలంటైన్స్‌ డే శుభాకాంక్షలు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో లలిత్‌ మోదీ ప్రకటించాడు.

5 /7

ఆ సందేశంతోపాటు తన కొత్త ప్రియురాలి ఫొటోలు, వీడియోలు లలిత్‌ మోదీ పంచుకున్నాడు. ఈ సందర్భంగా గతంలో ప్రేమించిన మాజీ విశ్వసుందరి, స్టార్ హీరోయిన్‌ సుస్మితా సేన్‌తో తెగదెంపులు చేసుకున్నాడు.

6 /7

లలిత్‌ మోదీ తొలి భార్య మినాల్‌ మోదీ క్యాన్సర్‌తో మృతిచెందింది. 1991లో మినాల్‌ను వివాహం చేసుకోగా ఆమె 2018లో కన్నుమూసింది. వీరిద్దకి ఇద్దరు పిల్లలు కలిగారు. అనంతరం 2022లో హీరోయిన్‌ సుస్మితా సేన్‌తో సంబంధం కొనసాగించాడు. 

7 /7

వాలంటైన్స్‌ డే రోజు లలిత్‌ మోదీ తన ప్రియురాలి ఫొటోలు, వీడియోలు పంచుకున్నారు. ఇంతకీ ఆమెవరు? అని ఆరా తీయగా వివరాలు లభించాయి. లలిత్‌ మోదీ కొత్త ప్రియురాలి పేరు రియా బౌరీ. ఆమె లెబనాన్‌లో స్థిరపడిన స్వతంత్ర కన్సల్టెంట్‌. మార్కెటింగ్‌ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆమెతో కొన్నేళ్ల కింద పరిచయం అయ్యి ఇప్పుడు ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు.