నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
List Of Comorbidities For COVID-19 Vaccination: నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
మార్చి 1న దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ కింది 20 వ్యాధుల వివరాలు తెలుసుకోండి. 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ఈ లక్షణాలు ఉంటే రిజిస్టర్ చేసుకోండి. Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే
1. గుండె సంబంధిత సమస్యలతో గత ఏడాదిలో ఆస్పత్రిలో చేరినవారు 2. కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నవారు లేదా ఎడమ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (LVAD) ఉన్నవారు 3. ఎడమ వెంట్రిక్యులర్ సిస్టోలిక్ పనిచేయనివారు (LVEF 40 శాతం కన్నా తక్కువగా ఉండటం). 4. సాధారణ లేదా అతి తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు Also Read: Also Read: Corona Vaccine: కరోనా విజేతలపై ఆసక్తికర విషయం, COVID-19 Vaccine ఒక్క డోసు ఇస్తే చాలు
5. PAH కారణంగా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు లేదా తీవ్రమైన PAH ఇడియోపతిక్ సమస్య 6. CABG లేదా PTCA లేదా MIతో కరోనరీ ఆర్టరీ సమస్య ఉన్నవారు మరియు హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌కు చికిత్స పొందుతున్నవారు 7. యాంజినా మరియు రక్తపోటు(Hypertension) లేదా షుగర్ వ్యాధి(Diabetes)కి చికిత్స తీసుకుంటున్నావారు 8. CT లేదా MRI స్ట్రోక్ డాక్యుమెంట్ మరియు రక్తపోటు లేదా డయాబెటిస్ పేషెంట్లు. Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..
9. పల్మనరీ ఆర్టరీ రక్తపోటు మరియు అధిక రక్తపోటు (Hypertension) లేదా షుగర్ వ్యాధి(Diabetes) చికిత్స పొందుతున్నవారు 10. పదేళ్ల కన్నా ఎక్కువగా మధుమేహం దాని సంబంధిత సమస్య మరియు రక్తపోటు సమస్యకు చికిత్స తీసుకుంటున్నవారు 11. మూత్రపిండాలు(Kidney) లేదా కాలేయం(Liver) లేదా హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న పేషెంట్లు లేదా అందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులు 12. హిమోడయాలసిస్ లేదా సీఏపీడీతో చివరి దశలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు Also Read: Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే జాంబీలుగా మారుతున్నారా
13. నోటి సంబంధిత కార్టికోస్టెరాయిడ్స్ లేదా రోగనిరోధక శక్తిని పెంపుదల కోసం దీర్ఘకాలం నుంచి మెడిసిన్ వినియోగిస్తున్నవారు 14. సిర్రోసిస్ క్షీణించిన వ్యక్తులు 15. గత రెండేళ్ల కాలవ్యవధిలో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో లేదా FEVI 50 శాతం కన్నా తక్కువగా ఉన్న వ్యక్తులు 16. లింఫోమా లేదా లుకేమియా లేదా మైలోమా లక్షణాలు కలిగినవారు Also Read: Migraine: తలనొప్పే కదా అని ఈజీగా తీసుకోవద్దు, Neck Pain వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి
17. జూలై 1, 2020 తరువాత క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయిన వ్యక్తులు లేదా ప్రస్తుతం ఏదైనా క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నవారు 18. ఎర్రకణముల క్షీణత (Sickle Cell Disease) లేదా ఎముక మజ్జ వైఫల్యం (Bone Marrow Failure) లేదా అప్లాస్టిక్ అనిమియా లేదా తీవ్రమైన తలసేమియా ఉన్నవారు 19. రోగనిరోధక శక్తికి సంబంధిత ప్రాథమిక వ్యాధులు లేదా HIV ఇన్‌ఫెక్షన్ 20. మానసిక వైకల్యం వ్యక్తులు లేదా కండరాల బలహీనత లేదా యాసిడ్ దాడి వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతింటే లేదా ఇతరుల మీద ఆధారపడే దివ్యాంగులు లేదా చెవిటి-అంధత్వం లాంటి పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు (Photo: Twitter)