Maggi Noodles: చిల్లీ గార్లిక్ మ్యాగీ మసాలా రెసిపీ.. టేస్ట్‌ చేస్తే మతిపోతుంది..!

Maggi Noodles: మ్యాగీ అనగానే పిల్లలు, పెద్దలు ఎగిరి గంతులేస్తారు. తరుచు ఒకే రకమైన మ్యాగీ కాకుండా ఎప్పుడైనా ఈ చిల్లీ గార్లిక్ మ్యాగీ మసాలా రెసిపీ ట్రై చేశారా..? ఇది సాధారణ మ్యాగీ నూడుల్స్‌ కంటే ఎంతో రుచికరమైనది. ఈ స్టైల్ మ్యాగీని ఎక్కువగా బయట తయారు చేస్తుంటారు. కానీ దీని మీరు ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఏమి లేని సమయంలో ఈ మ్యాగీ తయారు చేసుకుంటే ఎంతో బాగుటుంది. ఈ రెసిపీలో మిరియాల వేడి, వెల్లుల్లి రుచి మ్యాగీ ఉప్పగా ఉండే రుచిని పూర్తి చేస్తుంది. మీరు దీన్ని వివిధ రకాల వెజిటేబుల్స్, చీజ్ లేదా గుడ్లతో కూడా తయారు చేయవచ్చు.

1 /6

చిల్లీ గార్లిక్ మ్యాగీ మసాలా రెసిపీ ఎంతో ప్రసిద్ధి చెందిన రెసిపీ. ఇది పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో తరుచు ఉపయోగించే పదార్థాలను వాడి దీని తయారు చేసుకోవచ్చు. 

2 /6

కావాల్సిన  పదార్థాలు: మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్, వెల్లుల్లి రెబ్బలు (తరిగినవి), ఎర్ర మిరపకాయలు (తరిగినవి), సోయా సాస్, వెనిగర్, ఉప్పు, నూనె, కొత్తిమీర (తరిగినది), 

3 /6

తయారీ విధానం: ఒక పాత్రలో నీరు మరిగించి, మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్‌లో ఇచ్చిన మసాలా పొడి వేసి, నూడుల్స్ వండుకోండి.

4 /6

వేడి చేసిన నూనెలో వెల్లుల్లి, ఎర్ర మిరపకాయలు వేసి వేగించండి. వాసన వచ్చాక, వండిన నూడుల్స్‌ను వేసి బాగా కలపండి.

5 /6

సోయా సాస్, వెనిగర్, ఉప్పు వేసి రుచికి తగినట్లుగా సర్దుబాటు చేసుకోండి.

6 /6

 కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి వెంటనే సర్వ్ చేయండి.