Maha Kumbh: రేపే మాఘి పౌర్ణమి.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న యోగి ఆదిత్యనాథ్.. స్టోరీ ఏంటంటే..?

Maghi purnima shahi snan: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు మాఘీ పౌర్ణమి వేళ లక్షలాది మంది  భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారని అధికారులు భావిస్తున్నారు.

1 /6

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా  భక్తులు ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. మన దేశం నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తుల వస్తున్నారు.  

2 /6

దాదాపు 144 ఏళ్ల తర్వాత ఏర్పడి మహాకుంభమేళ కావడంతో ప్రతి ఒక్కరు ఎలాగైన పుణ్యస్నానాలు ఆచరించాలని చూస్తున్నారు. బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహానాల్లో కుంభమేళకు బారులు తీరారు. దీంతో కుంభమేళ చుట్టుపక్కల దాదాపుగా.. 300 కి.మీల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

3 /6

ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా కుంభమేళ ట్రాఫిక్ జాబ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కుంభమేళ జన్వరి 13న  ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మరో రెండు షాహి స్నానాలు మిగిలి ఉన్నాయి.   

4 /6

రేపు అత్యంత శక్తివంతమైన మాఘి పౌర్ణమి షాహి స్నానం ఉంది. దీనికి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారని యూపీ సర్కారు భావిస్తుంది. ముఖ్యంగా.. ఈరోజు నుంచి అంటే.. మంగళ వారం తెల్లవారు జామున 4 గంటల నుంచి ఫిబ్రవరి 13న సాయంత్రం వరకు కుంభమేళ పరిసర ప్రాంతాలను నో వెహికిల్ జోన్ గా యూపీ సర్కారు ప్రకటించింది. అంటే ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇతర వాహానాల్ని కుంభమేళ లో అనుమతి ఇవ్వరు.

5 /6

అత్యవసర వాహానాలకు మాత్రమే దీన్నుంచి మినహయింపు ఉంటుంది.. ఇక వీఐపీ వాహానాల్ని సైతం పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వరు. గత నెల జన్వరి 29న మౌనీ అమావాస్య నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అధికారులు  అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో తాజాగా.. మాఘీ పౌర్ణమి నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

6 /6

మరోవైపు యోగి సర్కారు కుంభమేళలో ఇప్పటి వరకు 45 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని వెల్లడించారు. కుంభమేళకు వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా తమ సర్కారు కట్టుదిట్టమైన భద్రత చేపట్టిందని స్పష్టం చేశారు. మరొవైపు అపోసిషన్ పార్టీలు చేస్తున్న ఆరోపణల్ని యోగి ఆదిత్యనాథ్ ఖండించారు.