Mamta Kulkarni: కుంభమేళలో అద్భుతం.. సన్యాసం తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్..

Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళ వేడుకగా జరుగుతుంది. అయితే.. బాలీవుడ్ నటి కుంభమేళలో సన్యాసం తీసుకున్నారు.ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

1 /6

కుంభమేళలో ప్రతిరోజు లక్షలాదిగా  భక్తులు తరలివస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్నిరకాల చర్యలు చేపట్టారు. ఈక్రమంలో కుంభమేళలో బాలీవుడ్ నటి సన్యాసం తీసుకొవడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.   కుంభమేలలో కరణ్ అర్జున్ ఫెమ్, బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకున్నారు. ఆమె కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆతర్వాత అక్కడి విధి ప్రకారం.. తనకు తానుగా పిండప్రదానం చేసుకుని సన్యాసం స్వీకరించారు.  

2 /6

52 ఏళ్ల వయసులో నటి సన్యాసం తీసుకున్నారు. ఆమె తన మెడలో.. రుద్రాక్ష మాల ధరించి, భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో కనిపించింది. మమత యొక్క వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, అందులో ఆమె హిందూ సన్యాసి వలె కాషాయ రంగు దుస్తులను ధరించి కన్పిస్తున్నారు.

3 /6

మమతా కులకర్ణి మహాకుంభంలో జన్వరి 24న సన్యాసీనిగా మారారు. సన్యాసినిగా మారిన తర్వాత ఆమె కొత్త పేరు సాధ్వీ మై మమతానంద్ గిరి సాధ్వీగా మార్చారు.  మమతా కులకర్ణి తాను సన్యాసిగా మారడం తన  అదృష్టం అని చెప్పారు.

4 /6

మహాకుంభానికి రావడం,  దాని గొప్పతనాన్ని చూడటం నాకు చాలా మరపురాని క్షణమన్నారు. మహాకుంభం యొక్క ఈ పవిత్ర సమయాన్ని నేను కూడా చూడటం నా అదృష్టమని ఆమె తన సన్యాసినిగా మారిన తర్వాత చెప్పారు. 90వ దశకంలో బాలీవుడ్‌లో మమతా కులకర్ణి ఒక ఊపు ఊపారని చెప్పుకొవచ్చు.

5 /6

 కరణ్ అర్జున్ సినిమాలు, తిరంగ చిత్రం, చైనా గేట్, వక్త్ హమారా హై, క్రాంతివీర్, ఆషిక్ ఆవార్ వంటి సినిమాల్లో నటించారు. అదే విధంగా విక్కి కౌశాల్ తో ఆమెకు ఎఫైర్ ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది.  తెలుగులో..ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ సినిమాల్లో హీరోయిన్గా నటించారు.  

6 /6

అంతే కాకుండా..  గతంలో డ్రగ్స్ కేసులో కూడా ఆమెపై అనేక ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ మాఫియాతో లింక్ లు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది.  ఈ నేపథ్యంలో హిందీలో బిగ్ బాస్ 17 లో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో అవన్ని వదిలేసి ప్రస్తుతం సన్యాసం తీసుకొవడం ప్రాధాన్యత సంతరించుకుంది.