Maha Kumbh Mela Monalisa: 2025 మహా కుంభ మేళాలో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసా బాలీవుడ్ ఆఫర్ తో పాటు ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో కూడా అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగును.. మైసూర్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిసింది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్లో జగపతిబాబు కూడా పాల్గొన్నారు. తాజాగా రెండవ షెడ్యూల్ ఈ నెలలోనే మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే RC -16 సినిమా గురించి తాజాగా ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.
అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల సోషల్ మీడియాలో తేనెకళ్ల సుందరిగా పేరుపొందిన మోనాలిసా భోంస్లే ఎంతలా పాపులారిటీ సంపాదించిందో చెప్పాల్సిన పనిలేదు.ఈమెకు ఇటీవలే బాలీవుడ్ లో కూడా ఒక డైరెక్టర్ స్వయంగా అవకాశం ఇస్తాను అంటూ తెలియజేయడం జరిగింది. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు టాలీవుడ్ నుంచి మోనాలిసా ఒక బంపర్ ఆఫర్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ RC -16 చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించబోతోందట.
అయితే ఇప్పటివరకు హీరోయిన్గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేయగా.. కానీ మోనాలిసాకు సంబంధించి ఎటువంటి క్యారెక్టర్ ఇస్తారా అని అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా తన అమాయకపు చూపులతో అందంతో విపరీతంగా ఆకట్టుకున్న మోనాలిసా మరి ఈ సినిమాలో ఎలాంటి రోల్ అందుకుంటుందో చూడాలి.
రామ్ చరణ్ ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు మరి మోనాలిసా ఈ సినిమాలో నటిస్తే ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
రామ్ చరణ్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. ఇటీవల వచ్చిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో అందరి అంచనాలు కూడా ఈ సినిమాపైనే పెరిగిపోయాయి. మరి బుచ్చి బాబు ఉప్పెనతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు కానీ ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.