Maha Shivratri 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని అరుదైన మహాద్భుతాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా 60 యేళ్ల తర్వాత మహా శివరాత్రి నాడు ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతుంది. దీంతో 3 రాశుల వారి ఇంట్లో పెళ్లిభాజాలతో పాటు అనుకోని ధనప్రాప్తి కలగబోతుందట.
Maha Shivratri 2025: మహా శివరాత్రి.. ప్రతి నెల మనకు నెలలో బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తూ ఉంటుంది. కానీ మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని మహా శివరాత్రిగా భక్తులు ఘనంగా జరుపుకుంటారు. అంతేకాదు ఈనాడు లింగోద్భవంతో పాటు హాలా హలం సేవించి లోకాలను రక్షించిన రోజు కాబట్టి ఈనాడు మహా శివరాత్రిగా జరుపుకుంటారు. ఈ యేడాదిఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి వస్తోంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ సంవత్సరం మహా శివరాత్రి నాడు ఒక అరుదైన సంఘటన జరుగబోతుంది. 60 యేళ్ల తర్వాత చంద్రుడి మరకరాశిలో రవి కుంభంలో ఉండటం వలన కొన్ని అరుదైన యోగం ఏర్పడబోతుంది. దీని వలన ఈ మూడు రాశుల వారికి అనుకోని ధనయోగంతో పాటు పెళ్లి కానీ వారికి ఈ యేడాది పెళ్లి యోగం ఉండబోతుందని సమాచారం.
మిథున రాశి: ఈ మహా శివరాత్రికి వీరి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు డబ్బుకు సంబంధించిన పనిలో విజయం సాధిస్తారు. ప్రేమానుబంధాలు సాఫీగా సాగిపోతుంటాయి. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. చేసే వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి డబ్బు అందుకునే అవకాశం ఉంది. గత కొంత కాలంగా ఎదురు చూస్తే డబ్బు లభిస్తోంది. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు మంచి జీవిత భాగస్వామితో పెళ్లైవుతుంది.
సింహ రాశి: సింహా రాశి వారికి ఈ మహా శివరాత్రి రోజు నుంచి జీవితం మహాద్భుతంగా ఉండబోతుంది. కోరుకున్న ఆనందం లభిస్తోంది. వ్యాపారవేత్తలు అద్భుతమైన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు, విద్యార్ధులకు యోగ కాలం. పెళ్లి కానీ వారికి ఈయేడాది తప్పక పెళ్లై సెటిలైపోతారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రాదనుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది.
మేష రాశి: ఈ యేడాది మహా శివరాత్రి మేష రాశి వారికి స్వర్ణ యుగానికి నాంది అని చెప్పాలి. ఈ రాశుల వారు కోరుకున్న పనులన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి. చేతికి డబ్బు అందుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. అంతే కాదు చాలా కాలంగా కలలు కంటున్న ఉద్యోగం వీరికి లభించే అవకాశాలున్నాయి. అంతేకాదు వీరికి సంఘంలో మంచి స్థానం,గౌరవం లభిస్తుంది. ఆఫీసులో ప్రతి ఒక్కరూ మీ పనికి ప్రశంసిస్తూ ఉంటారు. పెళ్లి కానీ వారికి వైశాఖ మాసంలో కానీ శ్రావణంలో పెళ్లి జరిగే సూచనలున్నాయి.
గమనిక: ఈ ఆధ్యాత్మిక కథనం మతపరమైన, జ్యోతిష్యులు, పండితులు, నెట్ లో ఇచ్చిన సమాచారాన్ని మా ప్రేక్షక దేవుళ్లకు అందించాము. జీ న్యూస్ ఈ విషయాన్ని దీన్ని ధృవీకరించడం లేదు.