Maoists Killed: ములుగులో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల హతం..

Maoists Killed In Mulugu District: మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులను హతమయ్యారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

తెలంగాణ ములుగు జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.  

2 /5

ములుగు జిల్లాలోని చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌, మావోయిస్టుల మధ్య ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో గ్రే హౌండ్స్‌తోపాటు యాంటీ మావోయిస్టు స్క్వాడ్‌ కలిసి చేశారు.  

3 /5

అయితే, ఈ మృతుల్లో మావోయిస్టు కీలక నేత దళ కమాండర్‌ బద్రు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.  

4 /5

ఈ ఆపరేషన్‌లో పోలీసులు మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య మావోయిస్టుల ఏరివేతలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఐదుగురు మావోయిస్టులు హతం అయ్యారు.  

5 /5

మొన్న మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల నెపంతో ములుగు జిల్లాలోని ఇద్దరు గ్రామస్థులను కాల్చి చంపారు. వీరిద్దరూ అన్నదమ్ములుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులు లేఖను కూడా విడిచి వెళ్లారు. ఇందులో ఒకరు గ్రామ పంచాయితీలో పనిచేశారు.