Meenakshi Chaudhary Boy Friend: ప్రముఖ బ్యూటీ మీనాక్షి చౌదరికి, ఈ మధ్య వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. అందులో భాగంగానే సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ తన క్రష్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి మొదటిసారి తన సినీ కెరియర్ ను 'ఇచట వాహనములు నిలపరాదు' అనే సినిమా ద్వారా మొదలుపెట్టింది.ఆ తర్వాత పలు చిత్రాలలో నటించడమే కాకుండా స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాలను అందుకుంది. గుంటూరు కారం, మట్కా, ది గోట్ తదితర చిత్రాలలో కూడా నటించింది. అలాగే లక్కీ భాస్కర్ సినిమాతో మళ్ళీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగు, తమిళ భాషలలో భారీ స్థాయిలో ఫ్యాను ఫాలోయింగ్ సంపాదించుకుంది.
హీరో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా భారీగా రాబట్టడంతో చిత్ర బృందం అంతా కూడా పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొనడం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి తన ఫస్ట్ క్రష్ గురించి ఓపెన్ అయ్యింది. తన స్కూల్ టైం లో ఒక టీచర్ పైన తనకు క్రష్ ఉండేదని.. అయితే తన ఒక్కదానికే కాకుండా తమ క్లాసులో ఉన్న అమ్మాయిలు అందరికీ కూడా అదే ఫీలింగ్ ఉండేదంటూ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.
అతడే తన ఫస్ట్ క్రష్ అని కూడా వెల్లడించింది. ఆ తర్వాత మళ్లీ ఎవరిపైనా అలాంటి ఫీలింగ్ కలగలేదని వెల్లడించింది. తాజాగా మీనాక్షి చౌదరి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కూడా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కించడంతో మంచి విజయాన్ని అందుకోవడంతో.. తనకి చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది.
కాగా గత కొద్ది రోజులుగా అక్కినేని హీరో సుశాంత్ తో ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు.