Neeraj Chopra: నీరజ్‌ చోప్రా వైఫ్‌ హిమాని కూడా గోల్డ్‌ మెడలిస్ట్‌ అని తెలుసా?

Who is Himani Mor: ఒలింపిక్ మెడలిస్టు నీరజ్ చోప్రా నిన్న సైలెంట్ గా పెళ్లి చేసుకు మీ అందరినీ షాక్‌కు గురి చేశారు. నీరజ్ పెళ్లి చేసుకుంది హిమాని మోర్. హర్యానాకు చెందిన వారు. ఈ ఒలింపిక చాంపియన్ నిన్న ఆదివారం రోజు తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫోటోలను షేర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇంతకీ ఈ హిమాని మోర్ ఎవరు అని నెట్టింటా తెగ సెర్చ్ చేస్తున్నారు
 

1 /5

 నీరజ్ హిమానీల పెళ్లి హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా నీరజ్ చోప్రా షేర్ చేసుకున్నారు. మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి  కింద పోస్ట్ లో రాసుకు వచ్చారు.   

2 /5

ఇక హిమాని ప్రస్తుతం ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ లో మాస్టర్ డిగ్రీ మేనేజ్మెంట్  చేస్తున్నారు.సోనిపత్‌లో హిమాని విద్యాభ్యాసం పూర్తి చేసింది. సోనిపత్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా మంచి పేరు సంపాదించుకుంది.  

3 /5

అయితే, హిమాని కూడా టెన్నీస్ ప్లేయర్. 2017 తైపీ వరల్డ్ యూనివర్షిటీ గేమ్స్ నేషనల్ లెవల్స్ లో పాల్గొన్నారు. అంతేకాదు ఆమె స్కూలు వెబ్ సైట్ ప్రకారం  మలేషియాలో 2016లో జరిగిన వరల్డ్ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ సాధించారు.

4 /5

ప్రస్తుతం యూఎస్ లో చదువుతుంది.  అయితే, నీరజ్ చోప్రా రెండుసార్లు ఒలింపిక్ పథకాలను సాధించారు.  అయితే, నీరజ్ హిమానీలు ఇప్పటికే హనీమూన్ కోసం అమెరికాలో ఉన్నారు. వాళ్లు తిరిగి వచ్చిన వెంటనే భారత్ లో త్వరలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.   

5 /5

నీరజ్‌ చోప్రా ఇటీవల జరిగిన ప్యారిస్‌ ఒలింపిక్స్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. నీరజ్‌ చోప్రా మొదటి సింగిల్‌ గోల్డ్‌ మెడల్‌ భారత విన్నర్‌గా రికార్డు సృష్టించారు. హిమానీ మసచూస్సెట్‌ కాలేజీలో మహిళా అసిస్టెంట్‌ కోచ్‌గా పని చేశారు.