Mercury Transit 2024: ఈసారి దీపావళి చాలా ప్రత్యేకమైంది. జ్యోతిష్యపరంగా అరుదైన సంయోగాలు జరుగుతున్నాయి. ఫలితంగా వివిధ రాశులపై అద్భుతమైన ప్రభావం పడనుంది. ముఖ్యంగా బుధుడు అనూరాథ నక్షత్రంలో ప్రవేశించడం 3 రాశుల జీవితాన్ని మార్చేయనుంది. ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇక బుధగ్రహం అనూరాధ నక్షత్రంలో మారడం వల్ల కన్యా రాశి జాతకులకు గోల్డెన్ డేస్ ప్రారంభమౌతాయి. నవంబర్ 1 నుంచి ఈ రాశివారికి ఎక్కడ అడుగుగెడినా విజయం తధ్యం. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఈ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఊహించని సంపద చేతికి అందుతుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశముంది. విద్యార్ధులయితే పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
తులా రాశి జాతకులకు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న సమస్యలు తీరిపోతాయి. పనిచేసే చోట గుర్తింపు ఉంటుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి, వేతనం పెంపు వంటి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. డబ్బులకు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనం కొనే అవకాశముంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. తులా రాశి జాతకులకు నవంబర్ 1 నుంచి మహర్దశ పట్టనుంది.
మిధున రాశి జాతకులకు బుధుడి నక్షత్ర పరివర్తనం అత్యంత ప్రయోజనం కల్గించనుంది. నవంబర్ 1 నుంచి ఈ రాశి జాతకులకు పట్టిందంతా బంగారంగా మారనుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించడమే కాకుండా వేతనం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకశ్మిక ధనలాభం కలగడం వల్ల ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులకు మంచి రిటర్న్స్ లభిస్తాయి. విద్యార్ధులకు అనువైన సమయం.
హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశి లేదా నక్షత్రంలో ప్రవేశిస్తుంటుంది. అదే విధంగా నవంబర్ 1వ తేదీన అనూరాథ నక్షత్రంలో బుధుడి పరివర్తనం ఉంది. ఫలితంగా మొత్తం 12 రాశులపై ప్రభావం పడినా 3 రాశుల జాతకం మారిపోనుంది. నవంబర్ 1 నుంచి అంటే దీపావళి తరువాత నుంచి ఈ మూడు రాశులకు మహర్దశ పట్టనుంది.