MLC K Kavitha Emotional After Release From Jail: జైలు నుంచి విడుదలైన కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఐదు నెలల పాటు జైలులో ఉన్న ఆమె చిక్కిపోయినట్టు కనిపిస్తున్నారు. అనారోగ్యం.. సరైన తిండి లేకపోవడంతో కవిత భారీగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే తన కుటుంబం కనిపించగానే కవిత కన్నీటి పర్యంతమయ్యారు.
Kavitha Emotional: జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. 5 నెలలకు పైగా జైలులో ఉన్న ఆమె చిక్కినట్టు కనిపిస్తున్నారు.
K Kavitha Emotional: ఐదు నెలల తర్వాత తెలంగాణ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి బయటకు వచ్చారు.
K Kavitha Emotional: ఢిల్లీలోని తిహార్ జైలులో 165 రోజుల పాటు ఉండి జైలు నుంచి విముక్తి పొందారు.
K Kavitha Emotional: సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుతో కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
K Kavitha Emotional: బయటకు రాగానే మొదట తన బావ హరీశ్ రావును హత్తుకోగా.. అనంతరం తన కుమారుడు, భర్త అనిల్ కుమార్‌ను గట్టి ఆలింగనం చేసుకున్నారు.
K Kavitha Emotional: అనంతరం తన సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆలింగనం చేసుకుని రోదించారు. తన అన్న చేటీఆర్ చేతికి ప్రేమగా ముద్దు పెట్టడం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.
K Kavitha Emotional: పార్టీ నాయకులకు అభివాదం చేసిన ఆమె వాహనంలో వెళ్లిపోయారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని గులాబీ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగారు. కవిత రాకతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరిగాయి.
K Kavitha Emotional: జైలు నుంచి విడుదలైన అనంతరం కవిత రెట్టింపు ధైర్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. 'నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని.. మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పని చేస్తాం. కమిట్మెంట్తో పని చేస్తాం. అందరితో నిలబడతానని చెబుతున్నా. వడ్డీతో వసూలు చేస్తా' అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.