Very Costly Salt: ఉప్పులకే ఉప్పు.. ఊదారంగు ఉప్పు.. ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే భయ్యా..

Very Costly Salt: ఎప్పుడైనా ఖరీదైన ఉప్పు చూశారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న జుగ్యోమ్ ఉప్పు మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఉప్పుగా కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.  

Very Costly Salt: ఉప్పు మానవుల జీవితంలో ఒక భాగమైంది. ప్రతి ఆహారం ఉప్పుతో ముడి పడి ఉంటుంది. ఉప్పులేని ఆహారాలు తినడం చాలా కష్టం. అంతేకాకుండా రోజు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కూడా కలుగుతాయి. ఇదిలా ఉంటే ఉప్పు అన్ని ఆహార పదార్థాల కంటే చాలా చౌకగా ఉంటుంది. కానీ కొన్ని రకాల లవణాలతో కూడిన ఉప్పు ధర వేయిలలో ఉంటుందని చాలా మందికి తెలియదు..
 

1 /5

కొన్ని దేశాల్లో లభించే ఉప్పు లక్షల్లో కూడా ఉంటుందట.. ఇందులో చాలా అరుదైన లవణాలు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్లు గానే ధరలు కూడా ఉంటాయని కొంతమంది చెబుతున్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో ఊదారంగుతో కూడాన ఓ ఉప్పు వైరల్‌ అవుతోంది.     

2 /5

ఈ ఊదారంగుతో కూడిన ఉప్పును  జుగ్యోమ్ అని పిలుస్తారు. దీని ధర తెలిస్తే అందరూ షాక్‌ అవ్వాల్సిందే.. ఈ ఉప్పు చిన్న ప్యాకెట్‌కే దాదాపు రూ.35000 ఉంటుంది. అంతేకాకుండా దీనిని చాలా మంది ఇప్పటికీ కూడా విక్రయిస్తున్నట్లు సమాచారం.  

3 /5

ఈ కొరియన్ వెదురు ఉప్పు ప్రస్తుతం ఖరీదైన ఉప్పుగా కొనసాగుతూ వస్తోంది. అంతేకాకుండా దీనిని ఇప్పటికీ కొరియన్‌ సాంప్రదయ వంటకాల్లో ఈ ఉప్పునే వినియోగిస్తున్నారని సమాచారం. అయితే ఈ ఉప్పును అన్ని ఉప్పుల్లా కాకుండా చాలా అరుదైన పద్దతిలో తయారు చేస్తారు.    

4 /5

ఈ ముడి ఉప్పును ముందుగా బొంగు కర్రల్లో ఉంచి అధిక ఉష్ణోగ్రత వద్ద తొమ్మిది సార్లకు పైగా కలుస్తారని సమాచారం. దీని ద్వారా ఉప్పు కూడా క్లిస్టర్‌ క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే దీనిని చాలా ఇతర అరుదైన పద్ధుల్లో కూడా తయారు చేస్తారట..  

5 /5

దీనిని కొరియన్ దేశ ప్రజలు వైద్యంలో కూడా వినియోగిస్తారు. అలాగే అత్యంత ఖరీదైన జుగ్యోమ్ ఉప్పులో ఎన్నో ఆయుర్వేద ఔషధ లవణాలు కూడా లభిస్తాయి. కాబట్టి దీనిని ఆహారాల్లో వినియోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది.