కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండటంతో ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అసలు యూపీఎస్ లేదా ఎన్‌పీఎస్ రెండింటిలో ఏది మంచిదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో ఏది మంచిదనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ రెండింటిలో ఏది ఉద్యోగులకు ప్రయోజనకరమూ పరిశీలిద్దాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఏకీకృత పెన్షన్ పధకం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానం అమల్లో రానుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు సైతం జారీ అయ్యాయి.
ఈ నేపధ్యంలో రెండు పెన్షన్ వ్యవస్థల్లో ఏది మంచిదనే ప్రశ్న చాలామంది ఉద్యోగుల్ని వేధిస్తోంది.
ఓ వ్యక్తి సరాసరి జీతం 80 వేలుంటే 25 ఏళ్లు సర్వీసు ఉంటే ఎన్‌పీఎస్ విధానంలో 10 శాతం ఉద్యోగి నుంచి 14 శాతం ప్రభుత్వం నుంచి సేకరిస్తారు. అంటే మొత్తం 24 శాతం ప్రతి నెలా జమ అవుతుంది.
25 ఏళ్లలో 80 వేలు జీతమున్నవ్యక్తికి ఎన్‌పీఎస్ విదానంలో నెలకు 19,2009 రూపాయలు జమ అవుతుంది. ఆ పై 9 శాతం వడ్డీ లభిస్తుంది. 25 ఏళ్లలో మొత్తం ఇన్వెస్ట్మెంట్ 57.60 లక్షలు కాగా వడ్డీతో కలుపుకుంటే 2,16,86,983 రూపాయలవుతుంది.
అదే యూపీఎస్ విదానమైతే ఉద్యోగుల్నించి 10 శాతం, ప్రభుత్వం నుంచి 18.5 శాతం ఉంటుంది. అటే నెలకు 28.5 శాతం చొప్పున నెలకు 22,80 రూపాయలు జమ అవుతాయి. 25 ఏళ్లలో మొత్తం ఇన్వెస్ట్మెంట్ 68.40 లక్షలు కాగా వడ్డీతో కలిపి 2,57,53,292 రూపాయలు అవుతుంది
ఎన్‌పీఎస్ విధానంలో పదవీ విరమణ తరువాత ఉద్యోగులు 60 శాతం అంటే 1,30,12,10 రూపాయలు అందుతాయి. మిగిలింది వార్షిక మొత్తంగా మారుతుంది. ఇందులో ఏడాదికి 6 శాతం వడ్డీతో 43,374 రూపాయలు అందుతాయి.
యూపీఎస్ విధానంలో జమ చేసిన డబ్బంతా ప్రభుత్వం వద్దనే ఉంటుంది. ప్రతి ఉద్యోగికి ప్రతి ఆరు నెలలకోసారి జీతంలో 10 శాతం చెల్లిస్తారు. అంటే 25 ఏళ్ల సర్వీసులో సగం జీతం 24 లక్షలు ఉంటుంది. పెన్షన్ నెలకు 50 వేలు వస్తుంది.
ఈ లెక్క ప్రకారం ఉద్యోగి ఎన్‌పీఎస్ విధానంలో 43 వేలు పొందడమే కాకుండా 2.17 కోట్లు అందుబాటులో ఉంటాయి. ఇక యూపీఎస్ విధానంలో 24 లక్షలు అందుతాయి. 2.33 కోట్లు ప్రభుత్వం వద్ద ఉంటుంది.
ఎన్‌పీఎస్ విధానంలో 1.30 కోట్లను ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేస్తే 6 శాతం వడ్డీ చొప్పున నెలకు 65 వేలు పొందవచ్చు. యూన్యుటీగా వచ్చే 43 వేలు కలుపుకుంటే నెలకు పెన్షన్ 1.08 లక్షలు అవుతుంది.
అదే యూపీఎస్ విధానంలో 24 లక్షలు ఎఫ్‌డీ చేస్తే 6 శాతం వడ్డీతో నెలకు 12 వేల రూపాయలు లభిస్తాయి. పెన్షన్‌తో కలిపితే 62 వేలు అవుతుంది.అంటే ఎన్‌పీఎస్ విధానంలో యూపీఎస్ కంటే 46 వేలు అదనంగా లభిస్తాయి.