Sankranti Muggulu 2024: భోగి, సంక్రాంతి రోజు వేయాల్సిన ప్రత్యేక ముగ్గులు ఇవే.. సింపుల్‌గా వాకిలి నిండా వేయండి..


Sankranthi Bhogi Special Muggulu 2024: మకర సంక్రాంతి రోజు వాకిలిని ముగ్గులతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. మన పూర్వీకులు కూడా ఈ పండగ రోజు ముగ్గులు పెట్టే వారిని పురాణాలు చెబుతున్నాయి. అయితే మీరు కూడా ముగ్గులు వేయాలనుకుంటున్నారా? మీకోసం మంచి డిజైన్స్ ని అందించబోతున్నాం.


Sankranthi Bhogi Special Muggulu 2024: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండగ ఎంతో ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కోడిపందాలు, సన్నాయి మోతలు గంగిరెద్దుల ఆటలు, చుక్కల ముగ్గులతో పల్లె ప్రాంతాలతో పాటు నగరాలు సంబరాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి అంటే చెప్పుకోదగినవి చాలా ఉన్నాయి. అందులో ఉదయాన్నే లేచి ముగ్గులు వేయడం ఒకటి.

1 /6

సంక్రాంతి పండగ రోజు ప్రతి మహిళ ఉదయాన్నే లేచి ఎంతో అందమైన ముగ్గులను వాకిట్లో అలంకరిస్తారు. ఒకటి కాదు రెండు కాదు పండగ రోజు వాకిలి నిండా ముగ్గులు వేసి ముస్తాబు చేస్తారు. ఈ సంవత్సరం మీరు కూడా మంచి ముగ్గును వేయాలనుకుంటున్నారా అయితే ఈ ఫోటో గ్యాలరీ మీకోసమే..  

2 /6

ముగ్గులతో ప్రారంభమైన పండగ సన్నాయి మోతలతో రోజంతా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు తమకిష్టమైన ముగ్గును ముందు రోజే ఎంచుకొని దానికి కావాల్సిన రంగులను కొనుగోలు చేస్తారు. మరి కొంతమంది అయితే ఓ పేపర్ పై ముందుగానే వేయాల్సిన ముగ్గును గీసుకుంటూ ఉంటారు.  

3 /6

మరి కొంతమంది అయితే ఎంచుకున్న ముగ్గులను ముందుగానే భోగి పండగ రోజు వాకిట్లో ప్రాక్టీస్ చేస్తారు. ప్రతి ఒక్కరు పండగ రోజు ఎలాంటి ముగ్గు వేసిన వాటి పక్కన మాత్రం తప్పకుండా గంగిరెద్దు ముగ్గును వేస్తారు.

4 /6

మకర సంక్రాంతి రోజు ముగ్గులు వేయడం ఓ ఆనవాయితీగా వస్తోంది. పురాణాల ప్రకారం ప్రతి సంక్రాంతి పండగ రోజు పూర్వీకులు ముగ్గులు వేసుకునే వారట. అంతేకాకుండా ముగ్గులలో తప్పకుండా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టే వారట.

5 /6

ఇప్పటికి కూడా పల్లె ప్రాంతాలలో పురాతన కాలం నుంచి వస్తున్న ముగ్గులను వేయడమే కాకుండా గొబ్బెమ్మలను కూడా పెడుతున్నారు. మరి కొంతమంది అయితే ముగ్గులు పెట్టిన తర్వాత వాటిని బంతిపూలతో కూడా అలంకరిస్తూ ఉంటారు.   

6 /6

మకర సంక్రాంతి రోజు ఇంటి ముందు ముగ్గులు పెట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లేనని పూర్వికులు చెబుతూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు ముగ్గులు పెట్టడం ఓ ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా కొంతమంది ముగ్గులలో రేగి పండ్లను కూడా పెడుతూ ఉంటారు.