Naga Chaitanya - Samantha: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య, సమంత జంటకు ఎంతమంది అభిమానులు ఉండేవారు చెప్పనవసరం లేదు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా.. పెళ్లి చేసుకుని.. వారి అభిమానులను ఖుషీ చేశారు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా నాగచైతన్య.. శోభితతో పెళ్లికి సిద్ధమవుతుండగా.. సమంతతో తనకున్న చివరి జ్ఞాపకాన్ని.. కూడా తీసేశారు.
నాగచైతన్య సమంతను ప్రేమించి , పెళ్లి చేసుకుని 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. వివాహం జరిగిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది ఈ జంట. ఆ తర్వాత నాగచైతన్య శోభితతో ప్రేమలో పడ్డారు.
ఏడాది ఆగస్టు 8వ తేదీన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. మరొకవైపు శోభిత ధూళిపాళ పెళ్లి పనులు మొదలుపెట్టింది. పసుపు దంచడం ,గోధుమ రాయి వంటి పనులు మొదలు పెట్టినట్లు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
ఇక పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా నాగచైతన్య తన మాజీ భార్య సమంతతో ఉన్న చివరి ఫోటోని కూడా సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించారు.
ఇక ఈ ఫోటో కాస్త తొలగించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2018 నుండి ఒకే ఒక్క త్రో బ్యాక్ ఫోటో ని మాత్రమే మిగిల్చగా.. ఇప్పుడు ఆ ఫోటోని కూడా ఆయన తొలగించేశారు.
అయితే ఒక నెటిజన్ వల్లే చైతన్య ఈ ఫోటో తొలగించినట్లు సమాచారం. ఒక నెటిజన్ చైతన్య ప్లీజ్ మీరు సమంతతో ఉన్న ఫోటోని తొలగించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని, పెళ్లికి సిద్ధమవుతున్నారు అంటూ కామెంట్ చేయగా చైతన్య ఆ ఫోటోని కాస్త తొలగించినట్లు సమాచారం.