Naga Chaitanya Step Brother: నాగ చైతన్య.. అక్కినేని మూడో తరం నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. చైతూకు అఖిల్ కాకుండా .. మరో తమ్ముడు కూడా ఉన్నాడనే సంగతి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో తెలుసా..
Naga Chaitanya: నాగ చైతన్య..ఒక తాత అక్కినేని నాగేశ్వరరావు లెజండరీ హీరో. మరో తాత రామానాయుడు లెజండరీ ప్రొడ్యూసర్. అంతేకాదు వీళ్లిద్దరు మన దేశంలో సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
అప్పట్లో సమంత, చైతూ పెళ్లికి వాళ్ల తల్లి లక్ష్మి వచ్చి ఆశీర్వదించారు. మరోవైపు లక్ష్మి, విజయ రాఘవన్ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఈ విషయం చాలా మంది తెలియదు. వాళ్ల అంత సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారు. ప్రస్తుతం అతను ఓ సాఫ్ట్ వేర్ కంపెనీతో పాటు పలు పరిశ్రమలను నిర్వహిస్తున్నాడు.
నాన్న నాగార్జున టాలీవుడ్ అగ్రహీరోగా సత్తా చూపెడుతున్నాడు. మేనమామ వెంకటేష్ కూడా టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు. తమ్ముడు అఖిల్ టాలీవుడ్ హీరో. బావ రానా కూడా ప్యాన్ ఇండియా నటుడు. మరో ఇద్దరు ముగ్గురు నటులున్నారు.
అయితే.. నాగ చైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడు. నాగ చైతన్య తల్లి లక్ష్మికి నాగార్జున విడాకులు ఇచ్చిన తర్వాత విజయ రాఘవన్ ను మరో పెళ్లి చేసుకుంది.
టెక్నికల్ గా నాగార్జున, లక్ష్మీలు విడిపోయారే కానీ.. ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరు ఒక్కచోట కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. నాగార్జున తన చెల్లి లక్ష్మికి విడాకులు ఇచ్చినా.. అవేం పట్టించుకోకుండా..ఎంతో కలిసి మెలిసి ఉంటారు. అయితే తల్లి లక్ష్మీ.. నాగార్జున తో విడాకులు తీసుకున్న తర్వాత విజయ్ రాఘవన్ ను రెండో పెళ్లి చేసుకుంది. నాగార్జున, అమలను రెండో వివాహాం చేసుకున్నారు.
అప్పట్లో తమ్ముడు పెళ్లి చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు అప్పట్లో నాగ చైతన్య, సామ్ దంపతులు కూడా హాజరయ్యారు. అతనికి సినిమాలతో అసలు సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక చైతూకు వున్న ఇద్దరు తమ్ముళ్లు కూడా సవతి సోదరులు కావడం విశేషం.