Skin Brightening Tips: ముఖం మెరిపించడానికి పార్లర్‌కు వెళ్లి వేల ఖర్చులు పెడతారు. అయితే మన బామ్మల కాలం నాటి ఇంట్లో తయారు చేసుకునే కొన్ని స్క్రబ్స్ ఉన్నాయి. వీటిని ఇంట్లో తయారు చేసుకొని సులభంగా అప్లై చేసుకోవచ్చు. దీంతో సహజ సిద్ధంగా ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాంటి స్క్రబ్స్ తెలుసుకుందాం
చక్కెర, తేనె కలిపి ముఖానికి మంచి ఎక్స్‌ఫోలియేటర్ తయారు చేసుకోవచ్చు. ఇది చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది.. ఈ రెండిటిని కలిపి స్క్రబ్ తయారు చేసుకొని సర్క్యూలర్ మోషన్‌లో ముఖమంతా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.
కొబ్బరి నూనె, కాఫీ పొడి కలిపి కూడా స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఇది లోతైన పోషణ అందిస్తుంది.. మంచి ఎక్స్పోలియేటర్, చర్మానికి పునరుజ్జీవనం కూడా అందిస్తుంది.. మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది .
బియ్యం పిండి, పాలు కలిపి కూడా ముఖానికి మంచి స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా సహజసిద్ధమైన కాంతి అందిస్తుంది. ఈ రెండిటిని కలిపి ముఖాన్ని సర్క్యూలర్ మోషన్‌లో స్క్రబ్ చేసుకోవాలి. మీ ముఖం మృదువుగా.. క్లియర్ గా ఈవెన్ స్కిన్ టోన్ పొందుతారు.
పసుపు మన బామ్మల కాలం నాటి నుంచి బ్యూటీ రొటీన్‌లో ఉపయోగిస్తున్నారు. వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. పసుపు, శనగపిండి రెండిటినీ కలిపి ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల ముఖం పై ఉన్న యాక్నే కూడా తొలగిపోతుంది మీ ముఖం కాంతివంతంగా యవ్వనంగా కనిపిస్తుంది
అంతేకాదు గ్రీన్ టీ, తేనె కలిపి కూడా ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి. దీంతో ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ కాకుండా చర్మానికి హైడ్రేషన్ అందుతుంది. ఈ స్క్రబ్ సర్క్యూలర్ మోషన్లో ముఖానికి రుద్దడం వల్ల మంచి పోషణ మీ స్కిన్‌కు అందుతుంది.