Yadagirigutta Brahmotsavam Bangaru Vimana Gopuram: తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఉత్సవ శోభతో తొణికిసలాడుతోంది. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పూర్తవగా ఆవిష్కరణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించిన స్వర్ణ తాపడం పూర్తవగా.. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది.
నాటి సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని శాస్త్రోక్తంగా.. ఆగమశాస్త్రం ప్రకారం పునఃనిర్మించారు. ఆలయా విమాన గోపురానికి స్వర్ణ తాపడం కార్యక్రమానికి అంకురార్పణ చేశారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ఆదివారం జరిగాయి. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవగా.. శాస్త్రోక్తంగా ఉత్సవాలు అర్చకులు నిర్వహించారు.
ఆలయ విమాన గోపురం మహాకుంభాభిషేకంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ భారీగా బంగారం విరాళం ఇవ్వగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు బంగారంతోపాటు నగదు విరాళాలు అందించారు.
భక్తుల విరాళాలతోపాటు దేవస్థానం, దేవాదాయ శాఖ సంయుక్తంగా కలిపి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించారు. స్వర్ణ గోపురంతో ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకుంది.