Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేసిన నిధి అగర్వాల్..!

Nidhhi Agerwal Upcoming Movie: గ్లామర్ తార నిధి అగర్వాల్ తన హరి హర వీరమల్లు సినిమా కోసం ఎంత కష్టపడుతోందో ఆమె షెడ్యూల్ చూస్తే అర్థమవుతుంది. తగిన నిద్ర లేకుండా, రెండు పెద్ద ప్రాజెక్టుల కోసం ఆమె చేస్తున్న కృషి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.  పూర్తి వివరాల్లోకి వెళ్ళితే..

1 /5

గ్లామర్ తార నిధి అగర్వాల్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న నటీమణుల్లో ఒకరిగా నిలిచింది. ఈమె రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ది రాజా సాబ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరి హర వీరమల్లు వంటి రెండు పాన్-ఇండియా చిత్రాల్లో నటిస్తోంది.  

2 /5

నిధి ప్రస్తుతం రెండు సినిమాల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతోంది. విజయవాడలో "హరి హర వీరమల్లు" కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షూట్ చేస్తోంది. ఆ తర్వాత హైదరాబాదు వెళ్లి "ది రాజా సాబ్" షూటింగ్‌లో పాల్గొంటుంది. షూటింగ్ పూర్తయ్యాక తిరిగి కారులో విజయవాడకు వెళ్లి మరుసటి రోజు షూట్‌కు హాజరవుతోంది.  

3 /5

నిధి తన కృషిని పంచుకుంటూ, వర్కపట్ల తనకున్న దేడికేషన్ గురించి తెలిపింది. అభిమానులు ఆమె హార్డ్ వర్క్‌ను ప్రశంసిస్తున్నారు. ఆమె "హరి హర వీరమల్లు" కోసం ఒక కాంట్రాక్ట్ పై సంతకం చేసింది, దీనివల్ల ఇతర సినిమాలు చేయకూడదని నిబంధన ఉంది. ఈ కారణంగా అనేక ప్రాజెక్టులను కోల్పోయినా, ఈ చిత్రం తన త్యాగాలకు తగిన ఫలితాన్ని అందిస్తుందని నిధి విశ్వాసంతో ఉంది అని వినికిరి.    

4 /5

మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా కోసం నిధి చేసిన త్యాగం విని ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో భాగం కావడం నిధి కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.   

5 /5

మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి. మరోపక్క ఈ చిత్రం.. నుంచి మాట వినాలి పాట ఈ మధ్యనే విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఎన్నో రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.