Non Sticky Dosa Tips: దోసెలు అడుగు అంటుకోకుండా, క్రిస్పీగా ఉండాలంటే ఏం చేయాలి

దోసె అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా దక్షిణాదిలో అతి ముఖ్యమైన, అత్యంత రుచికరమైన ఫుడ్ ఇది. ఇంట్లో దోసె వేసుకొనేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య పెనానికి అంటుకుపోవడం. సరిగ్గా రాకపోవడం. అయితే కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే పెనానికి అడుగు అంటుకోకుండానే క్రిస్పీ దోసె తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

Non Sticky Dosa Tips: దోసె అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా దక్షిణాదిలో అతి ముఖ్యమైన, అత్యంత రుచికరమైన ఫుడ్ ఇది. ఇంట్లో దోసె వేసుకొనేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య పెనానికి అంటుకుపోవడం. సరిగ్గా రాకపోవడం. అయితే కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే పెనానికి అడుగు అంటుకోకుండానే క్రిస్పీ దోసె తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
 

1 /5

పెనం వేడి దోసె తయారు చేసేందుకు మీడియం ఫ్లేమ్ ఉండాలి. పెనం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం స్ప్రే చేయాలి

2 /5

దోసె పిండి ఎలా ఉండాలి దోసె తయారు చేసేందుకు పిండి సరిగ్గా కలిపి ఉండాలి. అంటే పూర్తిగా పల్చగా  ఉండకూడదు. పూర్తిగా చిక్కగా ఉండకూడదు. నానబెట్టిన బియ్యం, మినపప్పు రుబ్బుకుని కొద్దిగా ఉప్పు మెంతి పౌడర్ వేసి 8-10 గంటలు అలానే ఉంచేయాలి

3 /5

పెనం ఆయిలీగా ఉండాలి దోసె తయారు చేసే ముందు పెనం శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిలీగా చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు చల్లితే దోసె అంటుకోకుండా ఉంటుంది

4 /5

క్రిస్పీ దోసె చేయడం ఎలా దోసెను క్రిస్పీగా చేసేందుకు దోశపై ఆయిల్ వేస్తుండాలి. ఇలా చేస్తే దోసె క్రిస్పీగా ఉంటుంది. 

5 /5

పెనంపై పిండిని పల్చగా వేసి గుండ్రంగా చేయాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టాలి. ఒక వైపు గోల్డెన్ రంగు వచ్చిన వెంటనే తిప్పాలి. రెండు వైపులా బంగారు రంగులో మారాలి