NTR Political Spl: తెలుగు నేలపై కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించిన ఎన్టీఆర్.. పొలిటికల్ గా సాధించిన ఘనతలు ఇవే..

NTR Political Spl: అన్న ఎన్టీఆర్.. దేశ వ్యాప్తంగా ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని తుడిచి పెట్టేసిన ఘనత అన్నగారు స్థాపించి తెలుగు దేశం పార్టీకే దక్కుతోంది. సంక్షేమ పథకాల విషయంలో అప్పట్లోనే అన్నగారు సెన్సేషన్ క్రియేట్ చేశారు.

1 /6

NTR Political Spl: నందమూరి  57 యేళ్ల వయసులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అన్నగారు.. 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీ స్థాపించారు.

2 /6

అంతేకాదు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్.  నటుడిగా ఉంటూ సీఎం  పీఠం అధిరోహించిన రెండో సినిమా వ్యక్తిగా ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేసారు. ఆయన కంటే ముందు ఎమ్జీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు

3 /6

కానీ పార్టీ పెట్టిన 9 నెలల తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి అయిన రికార్డు ఎన్టీఆర్‌కు దక్కుతుంది.ముఖ్యంగా రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం.. జనతా వస్త్రాలు..సంక్షేమ హాస్టళ్లు.. తెలంగాణ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి పలు సంచలన నిర్ణయాలు అన్నగారికి తిరుగులేని కీర్తిని తీసుకొచ్చాయి.  

4 /6

అంతేకాదు ఎన్టీఆర్ పోటీ చేసిన తొలి ఎన్నికల్లో 294 అసెంబ్లీ సీట్లకు గాను  204 సీట్లలో విజయం సాధించి రికార్డు క్రియేట్ చేసారు.  1984 లోక్‌సభ ఎన్నికల్లో 42 లోక్ సభ సీట్లకు గాను  35 ఎంపీ సీట్లును సాధించి సంచలనం సృష్టించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా పొందిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీగా టీడీపీ రికార్డు క్రియేట్ చేసింది.

5 /6

1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్నడు ఊహించని సీట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. నాల్గోసారి సీఎంగా  ప్రమాణ స్వీకారం చేసారు. ఆ తర్వాత లక్ష్మీ పార్వతిని రాజకీయేతర శక్తిగా చూపి కుటుంబ సభ్యుల సహాకారంతో చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలు చేజిక్కించుకున్నారు. దానికి అధికార మార్పిడి అనే ముసుగు తొడిగారు. అంతేకాదు ఎన్టీఆర్ పదవీచ్యుడిని చేసి తాను ముఖ్యమంత్రి అయ్యారు.

6 /6

చంద్రబాబుతో పాటు మొత్తంగా కుటుంబ సభ్యులు తన పట్ల ప్రవర్తించిన తీరుతో కలత చెందిన ఎన్టీఆర్..వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత 1996 జనవరి 18న ఆ బాధతోనే  కన్నుమూసారు.