Sr NTR Politics: పాలిటిక్స్ లో ట్రెండ్ సెట్టర్ ఎన్టీఆర్.. సీఎంగా అన్నగారి ఆ రికార్డు బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు..

NTR Politics: అన్న ఎన్టీఆర్.. ఈ పేరే ఓ ట్రెండ్ సెట్టర్. సినిమాల్లో రాజకీయాల్లో తిరుగులేని మనిషి. సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్‌తో సరికొత్త హిస్టరీ  క్రియేట్ చేసిన అన్న ఎన్టీఆర్.. పొలిటికల్ లీడర్ గా తెలుగు గడ్డపై సరికొత్త ట్రెండ్ సెట్ చేసారు.

1 /7

NTR Politics: అన్ననందమూరి తారక రామారావు  సినిమాల్లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను నెలకొల్పారు. అదే సమయంలో రాజకీయాల్లో అతి తక్కువ సమయంలో పెను సంచలనమే సృష్టించారు.

2 /7

13 యేళ్ల రాజకీయ జీవితంలో  4 సార్లు సీఎంగా  ప్రమాణ స్వీకారం చేసారు. 1983, 1984, 1985 వరుసగా మూడేళ్లు ఆంధ్ర ప్రదేశ్‌గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుంది.

3 /7

అంతేకాదు గత 42 యేళ్లుగా ఆయన స్థాపించిన తెలుగు దేశం అనే ప్రాంతీయ పార్టీ ఇప్పటికీ  పొలిటికల్ సస్టేన్ అవుతోంది.  సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు  ఎన్టీఆర్ సొంతం.

4 /7

ఎన్టీఆర్ రావడంతో  రాజకీయాల్లో సినీ నటులకు విలువ పెరిగింది. ఆయన కంటే ముందు కొంత మంది నటులు పొలిటికల్ గా రాణించారు. ప్రాంతీయ పార్టీలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది.

5 /7

తెలుగు దేశం పార్టీ అధినేతగా చైతన్య రథంపై ఆయన చేసిన యాత్ర పొలిటికల్ గా అప్పట్లో  సంచలనం సృష్టించింది. అద్వానీ మిగతా నాయకులకు రథయాత్రలకు ఎన్టీఆర్ ప్రేరణ అని చెప్పాలి.

6 /7

1984 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా సాగితే.. ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం ప్రభంజనం సృష్టించింది. అంతేకాదు లోక్‌సభ లో ఓ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం అదే మొదటి సారి చివరి అదే అని చెప్పాలి. 

7 /7

80వ దశకం చివర్లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన అన్నగారు ప్రధాని అవుదామనుకున్న కల నెరవేరకుండానే కన్నుమూసారు