Ola Generation 3 Ev Scooters: భారత మార్కెట్‌లోకి Ola కంపెనీ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన డిజైన్‌తో విడుదల కానుంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Ola Generation 3 Ev Scooters: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ Ola మరో ముందడుగు వేసింది. గతంలో విడుదల చేసిన స్కూటర్స్‌కి అప్డేట్ వెర్షన్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్కూటర్స్ మోస్ట్ పవర్‌ఫుల్ పీచర్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా గతంలో విడుదల చేసిన స్కూటర్స్ ఫీచర్స్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జనరేషన్ 3 స్కూటర్స్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రముఖ Ola కంపెనీ మార్కెట్‌లోకి జనరేషన్ 3 పేరుతో కొత్త స్కూటర్స్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఓలా కంపెనీ అధిపతి భవిష్ అగర్వాల్ అధికారికంగా ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
జనరేషన్ 3 సంబంధించిన ప్రీమియం ఫీచర్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ జనవరి 31వ తేది 10:30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ స్కూటర్స్ ధరలను దాదాపు 20 శాతం తగ్గింపుతో విక్రయించబోతున్నట్ల వెల్లడించారు.
ఈ జనరేషన్ 3 వెర్షన్‌లో భాగంగా మరో సారి రెండు కొత్త సిరీస్‌లను కస్టమర్స్‌కి పరిచయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో S2తో పాటు S3 సిరీస్‌లను విడుదల చేయబోతున్నట్లు అధికారిక సమాచారం.
S2 సిరీస్‌లో విడుదల కాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ సిటీ ఫ్రెండీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులోని రెండవ మోడల్ సుదూర ప్రయాణాలు చేసేందుకు చాలా బాగా పని చేయనుంది. అలాగే ఇందులో వివిధ రకాల మోడ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఇక ఈ రెండు స్కూటర్స్ వేరియంట్స్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీని ఫీచర్స్ గతంలో విడుదల చేసిన స్కూటర్స్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డిజైన్ కూడా ప్రీమియం లుక్‌లో కనిపించనుంది.