Parineeti Chopra-Raghav Chadha Wedding Pics: పరిణీతి చోప్రా-ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు వైరల్..!

Parineeti Chopra And Raghav Chadha Marriage: బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  ఆదివారం ఉదయపూర్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. నేడు తమ వివాహానికి సంబంధించిన పిక్స్‌ను పంచుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు నూతన జంటను ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
 

  • Sep 25, 2023, 23:01 PM IST
1 /5

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా సెప్టెంబరు 24న ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో గ్రాండ్ వేడుకగా వివాహం చేసుకున్నారు.  

2 /5

బీ టౌన్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే పెళ్లికి సంబంధించిన పిక్స్ ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తగా తీసుకున్నారు.   

3 /5

పెళ్లి తర్వాత రోజు సోమవారం ఉదయం పరిణీతి, రాఘవ్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉమ్మడి పోస్ట్‌లో భార్యాభర్తలుగా తమ మొదటి అధికారిక పిక్స్‌ను షేర్ చేశారు.  

4 /5

"అల్పాహారం టేబుల్ వద్ద మొదటి చాట్ నుంచి మా మనసులు మాకు తెలుసు. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం.. ఎట్టకేలకు మిస్టర్ అండ్ మిసెస్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఒకరినొకరు లేకుండా బతకలేం.." అని క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.  

5 /5

వీరి పెళ్లి పిక్స్‌ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలతోపాటు అభిమానులు కాంగ్రాట్స్ చెబుతున్నారు.