PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఛాన్స్‌.. రూ. 6000 కుటుంబంలో తండ్రి కొడుకు ఇద్దరికీ డబ్బులు జమా..?

PM Kisan Yojana: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అయితే, ఈ పథకం ద్వారా రూ.2000 మూడు విడతల్లో మొత్తం ఏడాదికి రూ.6000 జమా చేస్తారు. అయితే, కుటుంబంలో తల్లి కొడుకులు ఇద్దరికీ ఈ పథకం వర్తిస్తుందా?
 

1 /6

ఈ పథకంపై కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పథకం ద్వారా కుటుంబంలోని తల్లిదండ్రులు, భార్యాభర్తలపై భూమి ఉంటే ఇద్దరికీ కిసాన్‌ డబ్బులు వస్తాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మందికి పీఎం కిసాన్‌ రూ.2000 పొందడానికి అర్హులు అవుతారా?  

2 /6

ఈ పథకం ద్వారా ఏటా రూ.6000 డీబీటీ ద్వారా రైతులు పొందుతారు. రెండు హెక్టార్‌లు ఉన్న రైతులు ఈ పథకం పొందడానికి అర్హులు. ఏడాదిలో మూడుసార్లు రూ.2000 జమా చేస్తున్నారు.   

3 /6

ఏప్రిల్‌, జూలై మధ్యంలో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ డబ్బులు క్రెడిట్‌ అయ్యాయి. ఆగష్టు, నవంబర్‌ మధ్యంలో రెండో విడుత డబ్బులు క్రెడిట్‌ చేశారు. మూడో విడుత డబ్బులను డిసెంబర్‌ నుంచి మార్చి మధ్యలో రైతుల ఖాతాల్లో రూ.2000 జమా చేయనున్నారు.  

4 /6

అయితే, ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ప్రకారం కుటుంబంలో భార్యభర్తలు ఇద్దరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఒకవేళ వాళ్లు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్‌ కేన్సల్‌ అవుతుంది.  

5 /6

అలాగే, తండ్రికొడుకు, ఇతర కుటుంబ సభ్యులు ఒక్కరి కంటే ఎక్కువ మంది కుటుంబంలో పథకం లబ్ది పొందింతే వారి నుంచి డబ్బులను రికవర్‌ చేస్తారు. ఇప్పటికే ఎన్నోసార్లు కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది.  

6 /6

ప్రతి ఏడాది ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఈ విధానాన్ని ఇంట్లో కూర్చొని పూర్తి చేసుకోవచ్చు. దీనికి రిజస్టర్‌ మొబైల్‌ నంబర్‌ కలిగి ఉండాలి. వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత ఓటీపీ వస్తుంది.