Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.
దీనిపై చంద్రబాబు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రోజు రాత్రి అమరావతిలో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చంద్రబాబు మోదీ ఆఫర్ పట్ల ఏవిధంగా స్పందిస్తారో అనేది కీలకంగా మారింది.
ఏపీలో ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో వినూత్నంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్సీర్సీపీని చిత్తు చిత్తూగా ఓడించారు. అధికార వైఎస్సార్సీపీ కి చెందిన మంత్రులు, కీలక నేతలు ఓటమిని చవిచూశారు. ఏకంగా వైస్సార్పీపీ 8 జిల్లాలో కనీసం ఖాతాతెరవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయనగరం, నెల్లూరు జిల్లాలను క్లీన్ స్వీప్ చేయగా.. ఈ ఎన్నికలల మాత్రం కనీసం ఖాతా కూడా తెరవలేదు. దీంతో సీఎం జగన్ ఇప్పటి వరకు వైనాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్లారు.. కానీ సీఎం జగన్ మాత్రం ఊహించని ఫలితాలు ప్రస్తుతం వెలువడ్డాయి.
ఇక కేంద్రంలో.. బీజేపీ 400 టార్గెట్ గా ఎన్నికల బరిలో నిలిచింది.. కానీ అనూహ్యంగా బీజేపీకి 250 సీట్ల వరకు ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో బీజేపీకి, చంద్రబాబు అవసరం ఏర్పడింది. ఇదిలా ఉండగా గతంలో వాజ్ పేయ్ హయాంలో..చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.
దీంతో ఈసారి చంద్రబాబుకు మరోసారి ఎన్డీయే కన్వీనర్ పదవిని హోమంత్రి, అమిత్ షా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోదీ చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
పీఎం మోదీకి భారీ మెజార్టీ రాని నేపథ్యంలో.. చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేకు కీలకంగా మారింది. ఎన్డీయేకు గతంలో చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నఈ నేపథ్యంలో.. పాత వైరాన్ని పక్కనపెట్టి, మోదీ చంద్రబాబు సపోర్ట్ ను అడిగినట్లు తెలుస్తోంది.