PM Svanidhi Loan With Aadhaar card: ఆధార్ కార్డు మనకు గుర్తింపు మాత్రమే కాదు. దీంతో మీరు ఈజీగా లోన్ కూడా పొందవచ్చు. కేవలం ఆధార్ కార్డు తో రూ.50,000 పొందే అద్భుత అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. అదే ప్రధానమంత్రి స్వానిధి యోజన. ఈ స్కీం ద్వారా మీరు కూడా రూ.50,000 ఎలా సులభంగా పొందవచ్చు తెలుసుకుందాం.
ఆధార్ కార్డు మనదేశంలో గుర్తింపు కార్డు. ఇది ప్రతిఒక్కరికీ తప్పనిసరి. ఈ కార్డు లేకుంటే ఏ పథకానికి అర్హులు కాదు. ఏ విద్యాసంస్థల్లో సైతం సీటు సంపాదించలేరు. ఆధార్ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమే అనుకుంటే పొరపాటు దీంతో మీరు లోన్ కూడా పొందవచ్చు. ఆధార్ కార్డు ద్వారా సులభంగా రూ.50 వేల రుణం పీఎం స్వనిధి ద్వారా ఎలా పొందవచ్చు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి స్వనిధి యోజన 2020లో ప్రారంభించారు. ఇది కోవిడ్ 19 నేపథ్యంలో వ్యాపారస్తులకు సహకారం అందించేందుకు ఈ స్కీమ్ ని ప్రారంభించారు. ముఖ్యంగా వీధి వ్యాపారులకు ,సొంత వ్యాపారాలు చేసుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్కీం లో మీరు కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఏ గ్యారంటీ లేకుండా రూ.50వేల వరకు రుణం పొందవచ్చు.
ఈ పథకంలో మొదట పదివేలు లోన్ పొందుతారు. దాన్ని మీరు మొత్తం సకాలంలో చెల్లిస్తే ఆ తర్వాత రూ.20,000 పొందుతారు. అలా మీరు సులభంగా రూ.50 వేల వరకు మీకు రుణం అందిస్తారు. అయితే ఈ లోన్ పొందడానికి మీ వద్ద ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆధార్ కార్డు సాయంతో ఈ లోన్‌కు మీరు అప్లై చేయవచ్చు. ఈ డబ్బును 12 ఇన్స్టాల్మెంట్స్ లో మీరు తిరిగి చెల్లించాలి.
అధికారిక వెబ్ సైట్ లో ఈ లోన్ అప్లికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.. ఈ పథకానికి అప్లై చేసుకునే ముందు మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ కి లింక్ చేయడం తప్పనిసరి. తర్వాత మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఆన్లైన్లో ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక మీరు ఈ పథకానికి అర్హులు అవుతారో లేదో తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లో తెలుసుకోవచ్చు. ఇక ఈ పథకానికి అర్హులు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి.