Pooja Hegde Diwali Outfit: పూజా హెగ్డే ఫ్యాషన్ గురించి అమ్మాయిలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసిందంటే చాలు.. నిమిషాలలో లైక్స్ వచ్చి పడుతుంటాయి. అందుకు ముఖ్య కారణం పూజ హెగ్డే సెలక్ట్ చేసుకునే కలర్స్.. అలానే తన డ్రెస్ సెన్స్. ఇప్పుడు మరోసారి అదే ప్రూవ్ చేసుకుంది పూజ హెగ్డే.
తెలుగులో ఎంతోమంది అగ్ర హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకునింది పూజ హెగ్డే. కెరియర్ మొదట్లో ఒక లైలా కోసం.. ముకుందా లాంటి సినిమాలలో నటించిన ఈ హీరోయిన్ ఆ తరువాత ఇండస్ట్రీ హిట్లలో కూడా నటించింది.
ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజ హెగ్డే చేసిన.. అలా వైకుంఠపురంలో, అరవింద సమేత సినిమాలు ఆమెకు మంచి విజయాన్ని అందించాయి. ఇక ఆ సినిమాల విజయంతో తెలుగులో కొన్ని సంవత్సరాల పాటు పూజా హెగ్డే స్టార్ హీరోయిన్గా కొనసాగతం ఖాయం అనుకున్నారు అందరూ.
అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆమె కలల పైన నీళ్లు చల్లాయి. ముఖ్యంగా ఆచార్య, రాదేశామ్ సినిమాలో దిజాస్టర్స్ గా మిగిలాయి. పోనీ హిందీలో అన్న హిట్లు వస్తాయేమో అని.. అక్కడ ఏకంగా సదమాన్ ఖాన్ తో తన లక్ ట్రై చేసింది పూజ..
కానీ అక్కడ ఆ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది. అయినా ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ భారీ రెమ్యూనరేషన్ అడుగుతూ.. తనకు వచ్చిన ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉంది ఈ బుట్ట బొమ్మ.
సినిమాల విషయం కొద్దిసేపు పక్కన పెడితే.. స్టైల్ పరంగా మాత్రం పూజ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పుడు మరోసారి తన ఇంస్టాగ్రామ్ లో అందమైన ఫోటోలు షేర్ చేసి అందరిని ఆకట్టుకుంటుంది ఈ హీరోయిన్.