Qr Code Pan Card: కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి ఫిజికల్ కార్డ్‌పై క్యూఆర్ కోర్డ్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇది కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది.
Qr Code Pan Card: కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ కొత్త పాన్ కార్డ్ అనేక మార్పులతో విడుదలైంది. ప్రభుత్వం ఈ కార్డ్‌కు అదనంగా క్యూఆర్ కోడ్‌ను కూడా అందిస్తోంది. అలాగే గతంలో కొంత ఫీజులతో పాన్ కార్డ్ అందించిన కేంద్రం.. ఈ క్యూఆర్ కోడ్‌కి కొత్తగా ఫీజు వస్తులు చేస్తోంది. అయితే ఈ క్యూఆర్ కోడ్ వల్ల కలిగే లాభాలేంటో? దీనిని ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్ సేవలను మరింత సులభతరం చేసేందుకు పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌తో కూడిన పాన్ కార్ఢ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పుడు వచ్చే పాన్ కార్డ్‌లకు క్యూఆర్ కోడ్ కూడా అందుబాటులో ఉంది. అయితే గతంలో కంటే ఈ కార్డ్ ఎక్కువ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని తయారు చేసేందుకు ఖర్చులు కూడా పెరిగినట్లు కేంద్రం తెలిపింది. అందుకే ప్రత్యేకమై ఫీజును కూడా వసులు చూస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త పాన్ కార్డ్‌లో గతంలో ఉన్న కార్డ్ ఫీచర్స్ కంటే అనేక కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వానికి ప్రత్యేకమైన పన్నును చెల్లించేవారికి రిజిస్ట్రేషన్ సేవలను కూడా మార్చింది.
అలాగే ఈ కొత్త పాన్ కార్డ్‌లో PAN/TAN 1.0 ఎకో-సిస్టమ్ అప్‌గ్రేడ్‌ను కూడా అందించింది. అయితే ఈ కార్డ్‌తో ఐటీఆర్ ఫైల్ చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుందని కేంద్రం వెల్లడించింది.
కొత్త పాన్ కార్డ్ పొందాలనుకునేవారు రూ.50 చెల్లించాలి.. ఇది అప్లై చేసిన వారు మొదటగా ఇ పాన్ కార్డ్‌ను పొందుతారు. ఆ తర్వాత క్యూఆర్ కోర్డ్ కలిగిన ఫిజికల్ కాపీని పొందుతారు.