Gajakesari Rajyoga Effect: 2025లో మొదటి గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారి ఇండ్లు ఖజానాతో నిండిపోబోతున్నాయి..

Gajakesari Rajyoga Effect On Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో అతివేగంగా కదిలే గ్రహాల్లో చంద్ర గ్రహం ఒకటిగా భావిస్తారు. ఈ గ్రహం ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. దీనివల్ల అప్పుడప్పుడు గ్రహ సంయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహం ఇతర గ్రహాలతో కలయిక జరపడం వల్ల ఎంతో ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడతాయి. దీనివల్ల రాశుల వారిపై శుభ అశుభ ప్రభావాలు పడుతూ ఉంటాయి. 
 

1 /5

ఇదిలా ఉంటే జనవరి 9వ తేదీన చంద్ర గ్రహం ఇతర రాశిలో కలవడం వల్ల ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. అన్ని శక్తివంతమైన రాజయోగాల్లో గజకేసరి రాజయోగాన్ని కూడా ఎంతో కీలకమైంది గా భావిస్తారు. ఈ రాజయోగం ఏర్పడడం కొన్ని రాశుల వారికి అదృష్టంగా భావించవచ్చు.   

2 /5

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు జనవరి 9వ తేదీ రోజున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో బృహస్పతి గ్రహం కూడా సంచార దశలో ఉంది. దీనివల్ల రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. ఈ కలయిక వల్ల ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

3 /5

గజకేసరి రాజయోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందబోయే రాశుల్లో ధనస్సు రాశి వారు ముందుంటారు. ఈ రాశి వారికి జనవరి 9 నుండి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే చాలా మెరుగుపడతాయి. ముఖ్యంగా వీరికి అప్పుల బాధలు కూడా తొలగిపోబోతున్నాయి. అలాగే జీవిత భాగస్వామితో కలిసి ట్రిప్పులకు ప్లాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు కెరీర్ సంబంధమైన విషయాలపై కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు.   

4 /5

గజకేసరి రాజయోగం కుంభ రాశి వారిపై కూడా ఎఫెక్ట్ చూపుతోంది.. దీనివల్ల వీరికి ఈ సమయం ఎంతో లాభసాటిగా మారబోతోంది. ముఖ్యంగా వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే పనిలో గౌరవం పొందడమే కాకుండా డబ్బులు కూడా భారీగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు పూర్తవుతాయి. దీనివల్ల వీరు డబ్బులు కూడా విపరీతంగా పొందుతారు.   

5 /5

వృషభ రాశి వారికి కూడా గజకేసరి రాజయోగం వల్ల ధనలక్ష్మి అనుగ్రహం లభించబోతోంది. దీనివల్ల వీరు ఎలాంటి పనులు చేసిన విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి పరీక్షలు రాసిన విజయం మీ వెన్నంటే ఉంటుంది. అలాగే మీపై కుట్రలకు పాల్పడుతున్న వారికి కూడా అనేక ఆటంకాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన అధికారుల సపోర్టు లభిస్తుంది.