Redmi Note 14 5G New Modal 2025 Price: కొత్త వేరియంట్‌లో Redmi Note 14 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Redmi Note 14 5G Price: ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ Xiaomi తమ భారత కస్టమర్స్‌కి గుడ్‌న్యూస్ తెలిపింది. గతంలో విడుదలైన Redmi Note 14 స్మార్ట్‌ఫోన్‌ను కొత్త వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది విభిన్న వేరియంట్స్‌లో ఇప్పుడు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది ఆకర్శనీయమైన రంగులో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్త వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈ Redmi Note 14 5G స్మార్ట్‌ఫోన్ ఐవీ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. దీని డిస్ల్పే ప్రీమియంగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీని ప్రధాన కెమెరా 50MP AIతో వస్తోంది. అలాగే ఎంతో శక్తివంతమైన 5110mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Redmi Note 14 5G స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఇందులోని ఐవీ గ్రీన్ కలర్ వేరియంట్ ధన రూ. 21,000తో లభిస్తోంది. అంతేకాకుండా ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 6GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కలిగిన స్మార్ట్‌ఫోన్ రూ.17,999తో లభిస్తోంది.
ఇక ఈ మొబైల్ రెండవ వేరియంట్ (8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్) రూ.20,999లతో అందుబాటులో ఉంది. ఇందులోని కొత్త వేరియంట్ ప్రస్తుతం Mi.comలో అందుబాటులో ఉంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ కొత్త Redmi Note 14 5G వేరియంట్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీని డిస్ల్పే 6.67-అంగుళాల AMOLEDతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీని డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తోంది. అలాగే ఇది హై-రిజల్యూషన్ ఆడియోను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ మొబైల్ ప్రీమియం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగ ఉంటుది. అంతేకాకుండా భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోది. దీంతో పాటు ఇందులోని ప్రధాన కెమెరా 50MP Sony LYT-600 సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ఈ మొబైల్‌లో సెకండరీ కెమెరా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా సెన్సార్‌ని కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ 5110mAhతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. ఇక ఇది AI కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు AI బోకెతో పాటు డైనమిక్ షాట్స్ వంటి ఫీచర్స్‌ను కూడా అందుబాటులో ఉంటాయి.