Jio OTT Offer Plans: ఫ్రీగా ఓటీటీలు కావాలంటే ఈ జియో రీఛార్జ్ ప్లాన్స్ తీసుకోండి

దేశంలో అతిపెద్ద టెలీకం కంపెనీ రిలయన్స్ జియో.  ఇటీవల అన్ని ప్రైవేట్ కంపెనీలు టారిఫ్ పెంచడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్లను నిలబెట్టుకునేందుకు కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఆ ప్లాన్స్ గురంచి తెలుసుకుందాం.

Jio OTT Offer Plans: దేశంలో అతిపెద్ద టెలీకం కంపెనీ రిలయన్స్ జియో.  ఇటీవల అన్ని ప్రైవేట్ కంపెనీలు టారిఫ్ పెంచడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్లను నిలబెట్టుకునేందుకు కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఆ ప్లాన్స్ గురంచి తెలుసుకుందాం.

1 /5

జియో 1299 రీఛార్జ్ ప్లాన్. ఇది కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించవచ్చు. ఈ ప్లాన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందుతుంది.

2 /5

జియో 1049 రీఛార్డ్ ప్లాన్. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటాతో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో వస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. ఇవి కాకుండా సోనీ లివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి.

3 /5

రిలయన్స్ జియో 1029 రీఛార్జ్ ప్లాన్. ఇది కూడా 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటాతో వస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించవచ్చు. ఈ ప్లాన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితంగా లభిస్తుంది. ఇది మూడు నెలలకు వర్తిస్తుంది

4 /5

రిలయన్స్ జియో అందిస్తున్న మరో ప్లాన్ 949 రూపాయలు. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ రోజుకు 2 జీబీ డేటా లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా 90 రోజుల వ్యాలిడిటీ అంటే మూడు నెలల వరకూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా అందుకోవచ్చు.

5 /5

రిలయన్స్ జియో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్ అందిస్తోంది. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో వస్తోంది. ఈ ప్లాన్ టారిఫ్ ఏడాదికి 3999 రూపాయలు. రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం మీద 912.5 జీబీ డేటా లభిస్తుంది. 5జి ఫోన్ అయితే అన్‌లిమిటెడ్ 5జి నెట్‌వర్క్ అందుతుంది. దీంతోపాటు జియో సినిమా, జియో టీవీ ఉచితంగా లభిస్తాయి.